Sourav Ganguly : ఎలా సాయం చేయ‌గ‌ల‌న‌ని ఆలోచిస్తున్నా

కొత్తగా ప్రారంభించేందుకు రెడీ అవుతున్నా

Sourav Ganguly : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్, భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక ఆస‌క్తిక‌ర స‌న్నివేశాన్ని పంచుకున్నారు.

నా క్రికెట్ కెరీర్ లో ఈ ఏడాది అత్యంత ముఖ్య‌మైన‌ది. తాను ఆట‌గాడిగా కెరీర్ మొద‌లు పెట్టిన‌ప్పుడు 1992. ఆ ఏడాది నా జీవితంలో మ‌రిచి పోలేని రోజు. ఇదే స‌మ‌యంలో ఇప్పుడు 2022 సంవ‌త్స‌రం.

అంటే మొత్తం ఈ క్రికెట్ జ‌ర్నీలో 30 ఏళ్లు గ‌డిచాయి. ఎన్నో మైలు రాళ్లు ఉన్నాయి. మ‌రిచి పోని జ్ఞాప‌కాలు ఉన్నాయి. ఇవాళ నేను కావాల్సినంత కంఫ‌ర్ట్ జోన్ లో ఉన్నా. అన్నింటిని అనుభ‌వించాను.

కానీ భార‌త దేశంలో క్రికెట్ అంటే ఓ మ‌తంలా భావిస్తారు. దానిని ప్రాణ ప్ర‌దంగా ప్రేమిస్తారు. ఇందుకు ఉదాహ‌ర‌ణే తాజాగా ముగిసిన ఐపీఎల్ టోర్నీ. నాకు అండ‌గా నిలిచిన వారున్నారు. న‌న్ను వెన్ను త‌ట్టి ప్రోత్స‌హించిన వాళ్లు ఉన్నారు.

అంత కంటే తాను ఎక్క‌డికి వెళ్లినా విసుక్కోకుండా స‌హ‌క‌రించిన భార్య‌, కూతురు, కుటంబం కూడా ఉంద‌ని పేర్కొన్నారు సౌరవ్ గంగూలీ(Sourav Ganguly). జీవితానికి, త‌రాల‌కు స‌రిప‌డా ఆస్తులు ఉన్నాయి.

కానీ వాట‌న్నింటికి మించి క్రికెట్ అభిమానులు, ప్ర‌ధానంగా దేశ ప్ర‌జ‌లు నా ప‌ట్ల కురిపిస్తున్న ఆద‌రాభిమానాలు న‌న్ను మ‌రింత ముందుకు వెళ్లేలా చేస్తున్నాయి.

ఈ ముప్పై ఏళ్ల ప్ర‌స్తానం సంద‌ర్భంగా ఒక ర‌కంగా చెప్పాలంటే నాకు గొప్ప అనుభూతిని మిగిల్చింద‌నే చెప్ప‌క త‌ప్ప‌దు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఏదో ఒక దానిని ప్రారంభించాల‌ని ప్లాన్ చేస్తున్నాన‌ని తెలిపాడు.

దీని వ‌ల్ల ఎంతో మందికి స‌హాయ ప‌డ‌గ‌ల‌న‌ని ప్ర‌క‌టిస్తున్నాన‌ని స్ప‌ష్టం చేశాడు సౌర‌వ్ గంగూలీ(Sourav Ganguly). నేను చేప‌ట్ట‌బోయే ఈ కార్య‌క్ర‌మానికి మీ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని పేర్కొన్నాడు దాదా.

Also Read : సౌర‌వ్ గంగూలీ ట్వీట్ క‌ల‌క‌లం

Leave A Reply

Your Email Id will not be published!