Sourav Ganguly : రాజకీయ అరంగేట్రం అంతా అబద్దం
నో పాలిటిక్స్ ఓన్లీ క్రికెట్ - గంగూలీ
Sourav Ganguly : దేశ వ్యాప్తంగా చర్చకు పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రెసిడెంట్ , భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ(Sourav Ganguly) చేసిన ట్వీట్. సోషల్ మీడియాలో హల్ చల్ గా మారింది.
తాను సరికొత్త సేవలకు ఎంట్రీ ఇవ్వబోతున్నానంటూ ఆయన పేర్కొనడం క్రికెట్ వర్గాలనే కాదు ఇతర వర్గాలలో, పొలిటికల్ సెక్టార్ లో కలకలం రేగింది.
కోల్ కతా ను సందర్శించిన కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా ప్రత్యేకంగా బీసీసీఐ బాస్ గంగూలీతో సమావేశం అయ్యారు. 45 నిమిషాలకు పైగా వీరి మధ్య ఆసక్తికర చర్చలు జరిగాయి.
ఆయన తనయుడు, బీసీసీఐ కార్యదర్శి జే షా కూడా ఉండడం పొలిటికల్ ఎంట్రీ ఇస్తారనే ప్రచారం జోరందుకుంది. ఈ తరుణంలో బుధవారం చేసిన ట్వీట్ మరింత అగ్నికి ఆజ్యం పోసింది.
దీనిపై సెక్రటరీ జే షా వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో తానే స్వయంగా రంగంలోకి దిగాడు బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ(Sourav Ganguly) తాను చేసిన ట్వీట్ పై వివరణ ఇచ్చాడు దాదా.
తాను కొత్త ప్రయాణం చేయబోతున్నది వాస్తవమేనని అంగీకరించాడు. అయితే ఆ జర్నీ రాజకీయ రంగానికి చెందింది మాత్రం కాదన్నాడు. తాను పాలిటిక్స్ లో చేరుతున్నానంటూ జరుగుతున్న ప్రచారాన్ని కొట్టి పారేశాడు.
అదంతా అబద్దమని స్పష్టం చేశాడు సౌరవ్ గంగూలీ. కొందరు ఉద్దేశ పూర్వకంగా తప్పుదారి పట్టించారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తాను విద్యా రంగానికి సంబంధించి ఓ ఎడ్యుకేషనల్ యాప్ ను ప్రారంభించానని చెప్పాడు.
ఇది ప్రపంచ వ్యాప్తంగా అందుబాటు లోకి వస్తుందని స్పష్టం చేశాడు. దీంతో గంగూలీ రాజకీయ ప్రచారానికి తెర పడింది.
Also Read : సౌరవ్ గంగూలీ ట్వీట్ కలకలం