PM Modi : మోదీ సంతకం మహిళా బాక్సర్ సంతోషం
మహిళా బాక్సర్లకు ప్రధానమంత్రి ప్రశంసలు
PM Modi : కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం క్రీడా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ప్రధానంగా క్రికెట్ తో పాటు ఇతర క్రీడా రంగాలను ప్రోత్సహిస్తూ అథ్లెట్లు, క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందజేస్తోంది.
వారు సాధించిన విజయాలను ప్రశంసిస్తూ నగదు బహుమతులు ఇస్తూ మరింత ప్రతిభా పాటవాలను ప్రదర్శించేలా చర్యలు తీసుకుంటోంది.
ప్రధానంగా దేశ ప్రధాన మంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ(PM Modi) క్రీడాకారులను పలుకరించడం, వారు గెలుపొందిన ప్రతి సారి ఫోన్ లో మాట్లాడటం చేస్తూ వస్తున్నారు.
అంతే కాదు వారు దేశంలో కానీ లేదా విదేశాలలో కానీ సాధించిన విజయాల గురించి ప్రస్తావిస్తున్నారు. ప్రత్యేకించి మహిళా క్రీడాకారులను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు.
ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ప్రధాని నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమంలో కష్టపడి ఉన్నత స్థానంలోకి చేరుకున్న వారి గురించి తెలియ చేస్తున్నారు.
అంతే కాకుండా క్రీడాకారుల గురించి కూడా ప్రస్తావిస్తూ ప్రజలకు తెలియ చేసే పనిలో నిమగ్నమయ్యారు నరేంద్ర మోదీ.
తాజాగా ప్రపంచ ఛాంపియన్ షిప్ లో పతకాలు సాధించి భారత దేశానికి గర్వ కారణంగా నిలిచిన మహిళా బాక్సర్లు ప్రధాన మంత్రి(PM Modi) తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా వారిని ప్రత్యేకంగా అభినందించారు. దేశం మిమ్మల్ని చూసి గర్విస్తోందంటూ పేర్కొన్నారు. కాగా ఓ మహిళా బాక్సర్ తనకు మీ సంతకం కావాలంటూ కోరడం అంతలోనే మోదీ స్పందించడంతో సంతోషానికి లోనైంది పర్వీన్ హూడా.
Also Read : మహిళా బాక్సర్లకు మోదీ అభినందన