Johnny Depp Case : పరువు నష్టం కేసులో జానీ డెప్ గెలుపు
$15 మిలియన్ డాలర్లు చెల్లించాలని తీర్పు
Johnny Depp Case : ప్రపంచ వ్యాప్తంగా ఎంతో సంచలనం సృష్టించిన ప్రముఖ హాలీవుడ్ నటుడు జానీ డెప్ పరువు నష్టం కేసులో తుది తీర్పు వెలువడింది. కోట్లాది మంది అభిమానులను కలిగిన ఏకైక హాలీవుడ్ నటుడు జానీ డెప్.
మాజీ భార్య అంబర్ హార్డ్ జానీ డెప్ పై పరువు నష్టం దావా వేసింది. ఈ కేసుకు సంబంధించి యావత్ ప్రపంచం ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూసింది.
ఈ ఇద్దరు హాలీవుడ్ సెలబ్రిటీల మధ్య జరిగిన అస్పష్టమైన దావాలు, కౌంటర్ క్లెయిమ్ ల పై ఆరు వారాల పాటు కొనసాగింది విచారణ. ఇరువురి తరపున జ్యూరీ వాదనలు విన్నది. చివరి తీర్పు వెలువరించింది.
జానీ డెప్ మాజీ భార్యకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఈ మేరకు $15 మిలియన్ డాలర్లు జానీ డెప్(Johnny Depp Case) కు పరువు నష్టం కింద మాజీ భార్య అంబర్ హార్డ్ చెల్లించాలని తుది తీర్పు వెలువడింది.
దీంతో గత కొంత కాలంగా తీవ్ర ఇబ్బందులకు గురై, మానసికంగా, శారీరకంగా నానా తంటాలు పడుతున్న హాలీవుడ్ నట దిగ్గజం జానీ డెప్ కు భారీ
ఊరట లభించినట్లయింది.
యుఎస్ జ్యూరీ జానీ డెప్, మాజ భార్య అంబర్ ఇద్దరూ పరువు నష్టానికి బాధ్యులని నిర్ధారించింది. కాగా గృహ హింసకు సంబంధించిన తీవ్ర
వివాదాస్పద ఆరోపణలపై తీవ్రమైన విచారణ తర్వాత పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ స్టార్ జానీ డెప్ పక్షాన నిలిచింది.
దీంతో ఆరు వారాల పాటు సాగిన ఉత్కంఠ భరిత విచారణకు తెర పడింది. వర్జీనియా లోని ఏడుగురు సభ్యులతో కూడిన జ్యూరీ 58 ఏళ్ల
నటుడికి $15 మిలియన్ల నష్ట పరిహారం ఇవ్వాలని ఆదేశంచింది.
ఈ సందర్భంగా మాజీ భార్య జానీ డెప్(Johnny Depp Case) తనను లైంగిక హింసకు పాల్పడినట్లు 2018లో రాసిన కథనం పూర్తిగా అవాస్తవమని,
ఈ సందర్భంగా డెప్ కు పరువుకు భంగం కలిగిందని తెలిపింది.
Also Read : గాయక దిగ్గజం మూగ బోయిన స్వరం