Shae Gill Sidhu : సిద్దూ మరణం షే గిల్ విషాదం
ట్రోలింగ్ గురైన పాకిస్తాన్ గాయని
Shae Gill Sidhu : ప్రపంచ వ్యాప్తంగా పలువురు కళాకారులు ఇంకా మరిచి పోలేక పోతున్నారు పంజాబీ ప్రముఖ గాయకుడు సిద్దూ దారుణ హత్యను. తన పంజాబీ గాత్రంతో ఎంతో మంది అభిమానులనే కాదు గాయనీ గాయకులను కూడా మనసు దోచుకున్నాడు సిద్దూ.
పట్టుమని 28 ఏళ్లకే ముఠా తగదాల కారణంగా హత్యకు గురయ్యాడు. ఈ సందర్భంగా సిద్దూ మరణం తనను తీవ్రంగా కలిచి వేసిందని, అతడి
ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ పాకిస్తాన్ కు చెందిన ప్రముఖ గాయని షే గిల్(Shae Gill) పేర్కొంది.
ఈ మేరకు సోషల్ మీడియాలో తన విషాదాన్ని పంచుకుంది. దీంతో పాకిస్తాన్ కు చెందిన పలువురు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ట్రోల్ కు గురి చేశారు. ప్రస్తుతం షే గిల్(Shae Gill Sidhu) సింగర్ సోషల్ మీడియాలో హల్ చల్ గా మారింది.
హిట్స్ బ్యాక్ కోక్ స్టూడియో సీజన్ 14 పాట పసూరిలో కనిపించింది. ఆమె వాయిస్ కు వేలాది మంది ఫిదా అయ్యారు. ఆమెకు ఆ ఒక్క సాంగ్ యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందేలా తీసుకు వచ్చేలా చేసింది.
ఈ ఏడాది ప్రారంభంలో ఆమె మరింత పాపులర్ సింగర్ గా మారారు. ఇదే సమయంలో గాయకుడిగా పేరొందిన సిద్దూ(Sidhu) మరణం గురించి
విషాదాన్ని పంచుకున్నారు. ఇన్ స్టా గ్రామ్ లో తన బాధను వ్యక్తం చేశారు.
ఆమె తీవ్ర విమర్శలకు గురైంది. తాను క్రిష్టియన్ అయినందున వివిధ మతాలకు చెందిన వారి కోసం ప్రార్తనలు చేస్తానని తెలిపింది. ఈ హక్కు
తనకు ఉందని స్పష్టం చేసింది. ఈ సందర్బంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేసింది.
నా హృదయం విరిగి పోయింది. సిద్దూ మరణం నన్ను కలిచి వేసింది. అతడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని పోస్ట్ చేసింది. నేను ముస్లింను కాను క్రిష్టియన్ కు చెందిన వ్యక్తినని గుర్తించాలని కోరారు.
Also Read : ఇది ఊహించని దెబ్బ – అంబర్ హియర్డ్