Anand Mahindra : బాలిక గ్యాంగ్ రేప్ పై మహీంద్రా కామెంట్
సంస్కారం లేని దిగువ స్థాయి పిల్లలు
Anand Mahindra : హైదరాబాద్ కు చెందిన మైనర్ బాలిక సామాహిక అత్యాచారం కేసు దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఇప్పటికే ఉన్నత స్థాయి కుటుంబాలకు చెందిన పిల్లలు ఇందులో ఉన్నారని ప్రచారం జరిగింది.
వెస్ట్ జోన్ డీసీపీ ఐదుగురు నిందితులను గుర్తించామని వెల్లడించారు. రేప్ కు పాల్పడిన వారిలో ముగ్గురు మైనర్లు, ఇద్దరు మేజర్లు ఉన్నారని
తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మైనర్ల వివరాలు బయటకు వెళ్లడించ కూడదని చెప్పారు.
ఇప్పటి వరకు ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేశామని, మిగతా ముగ్గురి కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఒక ప్రముఖుడి కుమారుడు కూడా ఉన్నట్లు నిర్దారణ అయ్యిందని కానీ బయటకు చెప్ప కూడదన్నారు.
ఈ కేసులో రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ మనుమడు , బహదూర్ పురా ఎమ్మెల్యే కొడుకు ఉన్నట్లు వస్తున్న ప్రచారంలో వాస్తవం
లేదన్నారు డీసీపీ. ఇదంతా అవాస్తవమని పేర్కొన్నారు.
ఈ మొత్తం ఘటన దేశమంతటా చర్చకు దారి తీసింది. మరో వైపు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్ పటేల్ సీబీఐ చేత దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. అసలైన దోషులను తప్పించే ప్రయత్నం జరుగుతోందన్నారు.
ఈ తరుణంలో సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ చురుకుగా ఉండే ప్రముఖ వ్యాపార వేత్త మహీంద్ర గ్రూప్ ఆఫ్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర(Anand Mahindra) స్పందించారు. అత్యాచార ఘటనకు పాల్పడిన వారిని ఉన్నత స్థాయి కుటుంబాలకు చెందిన వారంటూ చెప్పడం సబబు కాదన్నారు.
నాగరకిత, సంస్కృతి, విలువలు మరిచి పోయిన దిగువస్థాయి క్యారెక్టర్ లేని కుటుంబాలంటూ పేర్కొనాలని సూచించారు. ప్రస్తుతం మహీంద్ర చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
Also Read : గ్యాంగ్ రేప్ కేసులో ఐదుగురు నిందితులు