Shaheen Afridi : స్పీడ్ బౌలింగ్ వ‌ల్ల లాభం లేదు

పాకిస్తాన్ క్రికెట‌ర్ షాహీన్ అఫ్రిదీ కామెంట్

Shaheen Afridi : పాకిస్తాన్ స్టార్ బౌల‌ర్ ష‌హీన్ అఫ్రిదీ సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు. భార‌త జ‌ట్టులో కొత్త‌గా చేరిన జ‌మ్మూ కాశ్మీర్ స్పీడ్ స్టార్ బౌల‌ర్ ఉమ్రాన్ మాలిక్ పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపాయి.

ప్ర‌పంచ క్రికెట్ లో చాలా మంది బౌల‌ర్లు మొద‌ట వేగంగా బౌలింగ్ చేశార‌ని, కానీ త‌ర్వాత త‌మ ఆట తీరును మార్చుకున్నార‌ని పేర్కొన్నాడు. బౌల‌ర్ కు కావాల్సింది వేగం కాద‌ని వికెట్లు తీయ‌డం ముఖ్య‌మ‌న్నాడు.

ప్ర‌ధానంగా మ్యాచ్ ల‌లో ప్ర‌త్య‌ర్థుల వికెట్లు తీయాలంటే లైన్ అండ్ లెంగ్త్ స‌క్ర‌మంగా ఉండేలా చూడాల‌ని సూచించాడు. లేక పోతే వేస్ట్ అని పేర్కొన్నాడు. స్పీడ్ సే కుచ్ న‌హీ హోతా బాస్ అంటూ సూచించాడు ష‌హీన్ అఫ్రిదీ(Shaheen Afridi).

ఇదిలా ఉండ‌గా స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌ర‌పున ఐపీఎల్ లో ఆడిన ఉమ్రాన్ మాలిక్ 22 వికెట్లు తీశాడు. మోస్ట్ ఎమ‌ర్జింగ్ బౌల‌ర్ గా ఎంపిక‌య్యాడు. భారీ ప్రైజ్ మ‌నీ కూడా ద‌క్కింది.

కానీ ఇదే స్పీడ్ ను న‌మ్ముకుంటే రాబోయే రోజుల్లో కంటిన్యూగా క్రికెట్ ఆడ‌డం క‌ష్టం అవుతుంద‌ని హెచ్చ‌రించాడు పాకిస్తాన్ ఫాస్ట్ బౌల‌ర్ ష‌హీన్ అఫ్రిది.

ఇదిలా ఉండ‌గా 2021లో అద్భుతంగా రాణించాడు. టాప్ బౌలర్ గా గార్ ఫీల్డ్ సోబ‌ర్స్ అవార్డును గెలుచుకున్నాడు. స్వింగ్ , లెంగ్త్ ఉండేలా చూసు కోవాల‌ని కోరాడు.

ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. లైన్ , లెంగ్త్ , స్వింగ్ లేక పోతే బ్యాట‌ర్ల‌ను సుల‌భంగా ఔట్ చేయ‌లేమ‌ని చెప్పాడు. ఫిట్ నెస్ కూడా పేస‌ర్ల‌కు అత్యంత ముఖ్య‌మ‌న్నాడు అఫ్రిది.

Also Read : గెలుపు ప‌దిలం బ‌హుమానం అపురూపం

Leave A Reply

Your Email Id will not be published!