IPL BCCI E Auction : 12న ‘బీసీసీఐ ఐపీఎల్’ సర్కార్ వారి పాట
మీడియా హక్కుల కోసం వేలం
IPL BCCI E Auction : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సరికొత్త చరిత్ర సృష్టించ బోతోంది. ఈనెల 12న ప్రపంచంలోని అతి పెద్ద రిచ్ లీగ్ మీడియా , డిజిటల్ బ్రాడ్ కాస్ట్ కోసం వేలం పాట జరగనుంది.
ప్రపంచ వ్యాప్తంగా ఈ వేలం పాటపై ఆసక్తి , ఉత్కంఠ నెలకొంది. స్టార్ , డిస్నీ, సోనీ, జీ, రిలయన్స్ 18 , అమెజాన్ , ఫేస్ బుక్ , గూగుల్ , బడా కంపెనీలు పాల్గొంటాయని అంచనా.
2023 నుంచి 2027 దాకా మీడియా, డిజిటల్ రైట్స్ అమ్మేందుకు వేలం పాట(IPL BCCI E Auction) చేపట్టనుంది బీసీసీఐ. ఇతర కంపెనీలు కూడా రంగంలోకి దిగే చాన్స్ లేక పోలేదు. ఇ-వేలం పాట ద్వారా ఇది కొనసాగనుంది.
బీసీసీఐ 5 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ. 50,000 వేల కోట్లు రానున్నట్లు అంచనా వేస్తోంది. భారతీయ కంపెనీలతో పాటు అమెరికన్
టెక్ కంపెనీ ఆపిల్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తుందని ప్రచారం జరుగుతోంది.
పారదర్శకత కీలకం. అమ్మకం లేదా హక్కుల ద్వారా వచ్చే ఆదాయం భారత దేశీయ నిర్మాణం, మెరుగైన మౌలిక సదుపాయాలు, క్రికెట్ సోదరుల సంక్షేమానికి ఖర్చు చేయడం జరుగుతుందని బీసీసీఐ బాస్ గంగూలీ వెల్లడించాడు.
టెలివిజన్ , డిజిటల్ హక్కులు వేర్వేరుగా చేశారు. ఈసారి టెండర్(IPL BCCI E Auction) ను బీసీసీఐ నాలుగు ప్యాకేజీలుగా విభజించింది.
ప్రపంచంలోని ఇతర ప్రాంతాల ప్రజలకు ప్రత్యేక ప్యాకేజీ ఉంటుంది.
ప్యాకేజీల పరంగా చూస్తే భారత ఉప ఖండం కోసం టెలిజన్ హక్కులు, డిజిటల్ హక్కులు, 18 మ్యాచ్ లసేకరణ (ప్రారంభ గేమ్, ఫ్లే ఆఫ్ గేమ్స్ , వారాంతపు డబులు – హెడర్ లు, సాయంత్రం గేమ్స్, మిగిలిన ప్రపంచం కోసం వీటిని వేలం పాట పాడనున్నారు.
నాలుగు కేటగిరీ ప్యాకేజీ ప్రారంభ ధర లేదా బేస్ ధర రూ. 32,890 కోట్లుగా ఉంది. టెలివిజన్ హక్కుల కోసం ఒక్కో మ్యాచ్ బేస్ ధర బీసీసీఐ
రూ. 49 కోట్లుగా ఉంచింది.
మ్యాచ్ లను పెంచినట్లయితే అదనపు మొత్తం ప్రో రేట్ ప్రతిపదికన వసూలు చేస్తారు. ఇక డిజిటల్ హక్కుల కోసం రూ. 33 కోట్లు, 18 మ్యాచ్ ల
బండిల్ కు రూ. 16 కోట్లు, ప్రపంచంలోని మిగిలిన వాటికి రూ. 3 కోట్లు వస్తాయి.
ప్యాకేజీలు గరిష్ట భాగస్వామ్యాన్ని నిర్దారించే పద్దతిలో విభజించాం. ఇది పోటీని తీవ్రంగా , పారదర్శకంగా ఉంటుందని బీసీసీఐ కోశాధికారి
అరుణ్ ధుమాల్ వెల్లడించారు.
వేలం పాట రెండు రోజుల పాటు కొనసాగుతుంది. మొదటి రోజు రెండు కేటగిరీల అమ్మకాలు, రెండవ రోజు మిగిలిన రెండు కేటగిరీలకు
వేలంపాట జరుగుతుంది. మొత్తంగా బీసీసీఐ భారత దేశంలో సరికొత్త రికార్డు నెలకొల్ప బోతోంది.
Also Read : గెలుపు పదిలం బహుమానం అపురూపం