Harbhajan Singh : బెంగాల్ టైగర్ సపోర్ట్ మరిచి పోలేను
2001లో తన ప్రదర్శనపై భజ్జీ కామెంట్
Harbhajan Singh : భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ , ఆప్ ఎంపీ హర్భజన్ సింగ్(Harbhajan Singh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒకప్పటి భారత జట్టుకు కెప్టెన్ గా , ప్రస్తుతం బీసీసీఐ చీఫ్ గా ఉన్న సౌరవ్ గంగూలీ అలియాస్ బెంగాల్ టైగర్ చేసిన సహాయం మరిచి పోలేనని పేర్కొన్నాడు.
2001లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సీరీస్ లో తాను అద్బుతమైన ప్రదర్శన చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు భజ్జీ. ఇది ఒక రకంగా గంగూలీకి మంచి పేరు కూడా తీసుకు వచ్చేలా చేసింది.
స్వదేశంలో తీవ్ర ఒత్తిడి నెలకొంది. వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్ , హర్భజన్ సింగ్ తదితర దిగ్గజ ఆటగాళ్లు గంగూలీ సారథ్యంలో బలమైన స్టీవ్ వా నాయకత్వంలోని ఆసిస్ తో తలపడింది.
శక్తివంతమైన ఆసిస్ జట్టును ఓడించి మూడు టెస్టుల సీరీస్ ను గెలుచుకునేలా చేశాడు. ముంబైలో జరిగిన మొదటి టెస్టులో 10 వికెట్ల తేడాతో ఓటమి తర్వాత భారత జట్టుకు హర్భజన్ సింగ్ బలమైన పునాదిగా మారాడు.
భజ్జీకి ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు గంగూలీ. ఏకంగా మూడు టెస్టుల్లో భజ్జీ 32 వికెట్లు తీశాడు. టాప్ వికెట్ టేకర్ గా నిలిచాడు. తనపై కెప్టెన్ దాదా పెట్టుకున్న నమ్మకాన్ని తిరిగి నిలబెట్టుకున్నానని ఆనాటి విజయాన్ని ప్రత్యేకంగా నెమరు వేసుకున్నాడు హర్భజన్ సింగ్(Harbhajan Singh).
తాను నాకు సాయం చేశాడు. నేను పరోక్షంగా గంగూలీకి హెల్ప్ చేశా. దీంతో తన కెరీర్ లో అది బెస్ట్ సీరీస్ గా నిలిచి పోయిందన్నాడు భజ్జీ. ఈ గెలుపుతో కెప్టెన్సీ పొడిగింపు కూడా లభించిందన్నాడు. నాకు సంపూర్ణ మద్ధతుగా నిలిచాడని ప్రశంసించాడు గంగూలీని.
Also Read : 12న ‘బీసీసీఐ ఐపీఎల్’ సర్కార్ వారి పాట