Subramaniyan Swamy IPL : ఐపీఎల్ లో ఫిక్సింగ్ షాకింగ్ కామెంట్స్
పక్కా మ్యాచ్ ఫిక్సింగేనంటూ సంచలన కామెంట్స్
Subramaniyan Swamy IPL : ఐపీఎల్ 2022 ముగిసింది. కానీ దానిపై ఇంకా నీలి నీడలు కమ్ముకున్నాయి. అప్పటి వరకు అద్భుతంగా ఆడిన రాజస్తాన్ రాయల్స్ అనుకోని రీతిలో ఫైనల్ లో గుజరాత్ టైటాన్స్ తో చేతులెత్తేసింది.
కేవలం ఆడడం కాకుండా ఔట్ అయ్యేందుకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. దీనిపై పలు ఆరోపణలు, అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇక దేశంలోనే మోస్ట్ పాపులర్ పొలిటికల్ లీడర్ గా , అంతకంటే పవర్ ఫుల్ న్యాయవాదిగా పేరొందారు భారతీయ జనతా పార్టీకి చెందిన మాజీ ఎంపీ సుబ్రమణ్య స్వామి.
ఆయన స్వంత పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానంగా కేంద్ర హోం శాఖ మంత్రి, ఆయన కుమారుడు బీసీసీఐ కార్యదర్శి జై షాపై నిప్పులు చెరిగారు. సంచలన ఆరోపణలు చేశారు.
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందంటూ సుబ్రమణ్య స్వామి(Subramaniyan Swamy IPL) ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఈ విషయంపై తాను ప్రజా ప్రయోజన వ్యాజ్యంతో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని హెచ్చరించారు.
దీంతో సుబ్రమణ్య స్వామి చేసిన ఈ ఆరోపణలతో కూడిన కామెంట్స్ కలకలం రేపాయి. వాస్తవాలు తెలియాలంటే దీనిపై సమగ్రమైన విచారణ జరపాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కుమారుడు జై షా నియంత్రిస్తున్నాడంటూ మండిపడ్డారు.
ఈ విషయంలో ప్రభుత్వం దర్యాప్తు చేసేందుకు ముందుకు వస్తుందని తాను అనుకోవడం లేదని పేర్కొన్నారు సుబ్రమణ్య స్వామి.
ఇదిలా ఉండగా బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జై షా తటస్థంగా ఉండాల్సింది పోయి సంబురాలు ఎలా చేసుకుంటారని ప్రశ్నించారు సుబ్రమణ్య స్వామి.
Also Read : భారత రెజ్లర్ సరిత అరుదైన ఘనత