Nupur Sharma : ఎవరీ నూపుర్ శర్మ ఏమిటా కథ
న్యాయవాది..పొలిటికల్ లీడర్
Nupur Sharma : ఎవరీ నూపుర్ శర్మ అనుకుంటున్నారా. ఇప్పుడు దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా పని చేశారు.
ముస్లింలు దైవంగా, పవిత్రంగా భావించే మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ డిబేట్ లో పాల్గొన్న సందర్భంగా. నూపుర్ చేసిన కామెంట్స్ యూపీలో కలకలం రేపాయి. ఏకంగా కాన్పూర్ లో ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది.
అక్కడ 144వ సెక్షన్ విధించేలా చేశాయి ఆమె కామెంట్స్ . ఈ ఘర్షణల్లో 40 మంది గాయపడ్డారు. యూపీ లోనే కాకుండా దేశ వ్యాప్తంగా తీవ్ర
విమర్శలు రావడంతో భారతీయ జనతా పార్టీ రంగంలోకి దిగింది.
హై కమాండ్ నూపుర్ శర్మ(Nupur Sharma) ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక ఆమె చేసిన కామెంట్స్ కు భారత
ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందేనంటూ ముస్లిం, అరబ్ , గల్ఫ్ దేశాలు పట్టు పడుతున్నాయి.
ఆయా దేశాలు భారత రాయబారులను పిలిపించి వివరణ అడుగుతున్నాయి. కాగా భారత ప్రభుత్వం ఈ మేరకు డ్యామేజ్ ను కాపాడుకునే ప్రయత్నం చేసింది.
ఈ మేరకు విదేశాంగ శాఖ వివరణ కూడా ఇచ్చింది. భారత ప్రభుత్వం అన్ని వర్గాలను, అన్ని మతాలను సమానంగా చూస్తుందని, ఒకరు చేసిన కామెంట్స్ ను ప్రభుత్వానివిగా భావించాల్సిన అవసరం లేదని పేర్కొంది.
ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. దీంతో నూపుర్ శర్మ(Nupur Sharma) చేసిన కామెంట్స్ తో ఒక్క రోజులోనే పాపులర్ గా మారి పోయారు.
ఆమెను సపోర్ట్ చేసే వారు కొందరుంటే ద్వేషించే వారు మరికొందరుగా విడి పోయారు.
ఇక ఎవరీ నూపుర శర్మ అని వెదకడం ప్రారంభించారు. న్యూఢిల్లీలో పుట్టారు నూపుర్ శర్మ. పీజీ ఎకనామిక్స్ లో చేశారు. ఢిల్లీ యూనివర్శిటీలో లా చదివారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి ఎల్ఎల్ఎం చదివారు.
కాలేజీ రోజుల నుంచే పాలిటిక్స్ పై ఆసక్తి పెంచుకున్నారు. ఏబీవీపి నుంచి ఢిల్లీ యూనివర్శిటీ లీడర్ గా ఎన్నికయ్యారు. బీజేవైఎం
నాయకురాలిగా ఉన్నారు.
యూత్ అంబాసిడర్ గా పని చేశారు. బీజేపీ అధికార ప్రతినిధిగా పని చేశారు. వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా నూపుర్ శర్మను పార్టీ నుంచి
సస్పెండ్ చేశారు.
Also Read : కామెంట్స్ కలకలం తీవ్ర దుమారం