Radhika Gupta CEO : వంకలు పెట్టినా సిఇఓగా ఎదిగిన గుప్తా
ఒకప్పుడు సూసైడ్ అటెంప్ట్ నేడు ఉన్నత పదవి
Radhika Gupta CEO : కొందరి జీవితాలు చాలా స్పూర్తి దాయకంగా ఉంటాయి. ఇంకొందరి జీవితాలు ఎల్లప్పటికీ తలుచుకునేలా చేస్తాయి. రెండూ ఒక్కటే కానీ తేడా ఒక్కటే అదే సక్సెస్. మరి మనం తెలుసుకునే ఆమె ఎవరో కాదు అసాధారణమైన పదవిని అలంకరించింది.
వ్యక్తిగతంగా ఎన్నో విమర్శలు ఎదుర్కొని, వంకర మెడ కారణంగా ఆత్మ న్యూనతకు గురై ఆత్మహత్య కు పాల్పడే దాకా వెళ్లింది. కానీ అన్నింటికి ఎదురొడ్డి నిలిచింది. తనను తాను ప్రూవ్ చేసుకుంది.
ఇవాళ దేశంలోనే అత్యంత పిన్న వయస్సు కలిగిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ (సిఇఓ)లలో రాధికా గుప్తా(Radhika Gupta CEO) ఒకరిగా నిలిచింది.
తను 22 ఏళ్లు ఉన్నప్పుడు సూసైడ్ చేసుకోవాలని అనుకుంది.
ప్రధానంగా తాను వంకర మెడతో పుట్టాను. ఇది ఒకింత తనను గేలి చేసేందుకు దోహద పడింది. కానీ దానిని నేను లైట్ గా తీసుకోవడం ప్రారంభించాను అని చెప్పింది రాధికా గుప్తా.
తండ్రి దౌత్యవేత్త. పాకిస్తాన్, న్యూయార్క్ , ఢిల్లీలో నివసించారు. తను ఎలా ఎదిగాననే దాని గురించి ఆమె ఆన్ లైన్ పోర్టల్ హ్యూమన్స్ ఆఫ్ బాంబే కోసం పోస్ట్ చేసింది.
ఇప్పుడు అది వైరల్ గా మారింది. చాలా రకాలుగా అవమానాలు ఎదుర్కొన్నాను కేవలం వంకర మెడ కలిగి ఉండడం వల్ల. చదువుకున్నా చాలా ఉద్యోగాలు రాకుండా పోయాయి.
ఒకసారి కిటికీలోంచి దూకాలని అనుకున్నా. నా స్నేహితుడు నన్ను వారించాడు. సైకియాట్రిక్ వార్డులో చేర్చారు. చివరకు నన్ను నేను ఏమిటో తెలుసుకున్నా.
మెకిన్సేలో జాబ్ సాధించా. కొన్నేళ్ల తర్వాత తన భర్త, స్నేహితుడితో కలిసి స్వంత ఆస్తి నిర్వహణ సంస్థను ప్రారంభించారు. ఆమె స్థాపించిన
కంపెనీని ఎడెల్వీస్ ఎంఎఫ్ కంపెనీ కొనుగోలు చేసింది.
కార్పొరేట్ నిచ్చెనలు ఎక్కాను. సూట్లతో నిండిన గదిలో చీరగా మారాను అని తన అనుభవాన్ని పంచుకుంది. ఇప్పుడు సదరు కంపెనీకి
రాధికా గుప్తా సిఇఓ(Radhika Gupta CEO) గా ఉన్నారు.
ఈ సక్సెస్ వెనుక తన భర్త ఉన్నాడని చెప్పింది. 33 ఏళ్ల వయస్సులో నేను అత్యంత పిన్న వయస్సు కలిగిన సిఇఓగా పేరొందడం నాకు
తెలియని సంతోషాన్ని కలిగించిందని పేర్కొంది.
Also Read : 12న ‘బీసీసీఐ ఐపీఎల్’ సర్కార్ వారి పాట