Mithali Raj : క్రికెట్ కు మిథాలీ రాజ్ గుడ్ బై
అన్ని ఫార్మాట్ లకు సెలవు
Mithali Raj : ప్రపంచ క్రికెట్ లో తనకంటూ ఓ ప్రత్యేకత కలిగిన హైదరాబాదీ మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. క్రికెట్ లోని అన్ని ఫార్మాట్ ల నుంచి తాను వైదొలుగుతున్నట్లు బుధవారం వెల్లడించింది.
ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించింది. పురుషాధిక్య క్రికెట్ రంగంలో మహిళా క్రికెట్ కు జనాదరణ తీసుకు రావడంలో మిథాలీ రాజ్(Mithali Raj) సక్సెస్ అయ్యారు. ఒక రకంగా ఆమెను మహిళా సచిన్ టెండూల్కర్ అని పిలిపించేలా చేసుకున్నారు.
వరల్డ్ క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్ గా కూడా పేరు పొందారు. భారత దేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు గర్వ పడుతున్నాను. దీనిని అత్యున్నత గౌరవంగా, గుర్తింపుగా భావించానని తెలిపింది మిథాలీ రాజ్.
ఇండియా బ్లూస్ ధరించే ప్రయాణంలో ఒక చిన్న అమ్మాయిగా బయలు దేరాను. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఎత్తులు మరెన్నో ఇబ్బందులు ఉన్నాయి.
ప్రతి సంఘటన నన్ను ప్రత్యేకంగా ఉండేలా చేసేందుకు దోహద పడిందన్నారు. గత 23 ఏళ్లుగా క్రికెట్ జర్నీలో ఉన్నా. ఎంతో గొప్పగా ఆటను ఆస్వాదించానని తెలిపింది మిథాలీ రాజ్(Mithali Raj).
ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నా. మరెన్నో మరుపురాని విజయాలలో పాలు పంచుకున్నా. ఇది ఒక రకంగా మరిచి పోలేనని తెలిపింది. నేను మైదానంలోకి అడుగు పెట్టిన ప్రతిసారీ భారత్ ను గెలిపించాలనే ఉద్దేశంతో నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చానని చెప్పింది.
భారత త్రివర్ణ పతాకానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కడం నా అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొంది. ఎందరో యువ క్రీడాకారిణిలు రాణిస్తున్నారు. క్రికెట్ కు మంచి భవిష్యత్తు ఉందన్నారు మిథాలీ రాజ్.
బీసీసీఐ చీఫ్ గంగూలీ, కార్యదర్శి జే షాకు, ఆదరించిన, సపోర్ట్ చేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని తెలిపారు. అభిమానులకు ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని పేర్కొన్నారు.
Also Read : ఆ ఇద్దరి కెప్టెన్సీ అద్భుతం – ద్రవిడ్