Mithali Raj : జ‌ర్నీ అద్భుతం ఆట చిర‌స్మ‌ర‌ణీయం

అంద‌మే కాదు క్రికెట్ లో కూడా సూప‌ర్

Mithali Raj : పురుషాధిక్య స‌మాజంలో ఒక మ‌హిళ ఎలా నెగ్గుకు రావాలంటే ఎంత ద‌మ్ముండాలి. ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొని ఉండాలి. క‌ష్టాలు దాటుకుని త‌నంత‌కు తానుగా క్రికెట‌ర్ గా త‌న ప్ర‌యాణాన్ని ప్రారంభించి అరుదైన చ‌రిత్ర‌ను సృష్టించింది హైద‌రాబాదీ మిథాలీ రాజ్(Mithali Raj).

ఆమె గురించి ఎంత చెప్పినా త‌క్కువే. హైద‌రాబాద్ అనే స‌రిక‌ల్లా ఎంద‌రో క్రికెట‌ర్లు గుర్తుకు వ‌స్తారు. వ‌స్తూనే మూడు సెంచ‌రీలో అరుదైన రికార్డును నెల‌కొల్పిన మ‌ణిక‌ట్టు మాంత్రికుడు మ‌హ‌మ్మ‌ద్ అజ‌హ‌రుద్దీన్ అయితే ఇంకొక‌రు మాత్రం ప‌క్కా చెప్పాల్సిన పేరు మిథాలీ రాజ్ మాత్ర‌మే.

ఇద్ద‌రూ ఇద్ద‌రే. ఒక‌రితో మ‌రొక‌రిని పోల్చ‌డం స‌రికాక పోయినా ఇద్ద‌రూ ప్ర‌పంచ క్రికెట్ లో త‌మ‌దైన ముద్ర వేశారు. ముంబై ఆధిప‌త్యానికి చెక్ పెట్టాడు అజ్జూ భాయ్.

ఇక మ‌హిళా క్రికెట్ లో మిథాలీ రాజ్(Mithali Raj)  ఓ సంచ‌ల‌నం. ఒక సాధార‌ణ క్రికెట‌ర్ గా కెరీర్ ను ప్రారంభించింది. అత్యున్న‌త‌మైన మ‌హిళా టీమిండియాకు కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించింది.

అత్య‌ధిక ప‌రుగులు సాధించి రికార్డ్ సృష్టించింది. రెండు ద‌శాబ్దాల‌కు పైగా అల‌స‌ట అన్న‌ది లేకుండా ఆడుతూ త‌న‌ను తాను ప్రూవ్ చేసుకుంది 

మిథాలీ రాజ్. ఎన్నో రికార్డులు మరెన్నో అవార్డులు ఆమె పేరు మీద ఉన్నాయి.

ఒక ర‌కంగా చెప్పాలంటే ఆమె ఓ క్రికెట్ దిగ్గ‌జంగా పేర్కొనక తప్ప‌దు. ప‌రుగుల వ‌ర‌ద పారిస్తూ వ‌చ్చిన ఈ మ‌హిళా బ్యాట‌ర్ ఇక ఆడ‌లేనంటూ సెల‌వు చెప్పింది.

అన్ని ఫార్మాట్ ల‌లో క‌లిపి అత్య‌ధిక ర‌న్స్ చేసిన క్రికెట‌ర్ గా అరుదైన ఘ‌న‌త సాధించింది మిథాలీ రాజ్. అజేయ సెంచ‌రీతో త‌న కెరీర్ ను ప్రారంభించి చివ‌ర‌కు హాఫ్ సెంచ‌రీతో ముగించింది.

భార‌త విమెన్స్ క్రికెట్ వ‌న్డే, టెస్టు జ‌ట్టు కెప్టెన్ గా ఉన్న ఆమె ఇక క్రికెట్ కు గుడ్ బై చెబుతున్న‌ట్టు ప్ర‌క‌టించింది. 1999 జూన్ 26న ఐర్లాండ్ తో త‌న కెరీర్ స్టార్ట్ చేసింది. 

2022 మార్చి 27న సౌతాఫ్రికా జ‌ట్టుతో 68 ప‌రుగులు చేసింది. మొత్తంగా త‌న కెరీర్ లో 23 ఏళ్ల పాటు ఆడింది.

Also Read : మ‌హిళా క్రికెట్ లోకంలో ఓ దృవ‌తార

Leave A Reply

Your Email Id will not be published!