Mithali Raj : ఎన్నో రికార్డులు మ‌రెన్నో అవార్డులు

మిథాలీ రాజ్ అత్య‌ధిక ప‌రుగుల రాణి

Mithali Raj : మ‌హిళా క్రికెట్ ప్ర‌పంచంలో హైద‌రాబాదీ స్టార్ క్రికెట‌ర్ మిథాలీ రాజ్ ఇక ఆడ‌లేనంటూ ప్ర‌క‌టించింది. యావ‌త్ క్రీడా లోకం ఆమె నిర్ణ‌యంతో విస్తు పోయింది.

రెండు ద‌శాబ్దాల‌కు పైగా ఒక క్రికెట‌ర్ గా త‌న జ‌ర్నీని కంటిన్యూ చేయ‌డం అంటే మామూలు విష‌యం కాదు. అన్ని ఫార్మాట్ ల‌లో క‌లిపి 10 వేల ప‌రుగులు చేసిన ఏకైక మ‌హిళా క్రికెట‌ర్ గా భార‌త దేశం నుంచి చ‌రిత్ర సృష్టించింది మిథాలీ రాజ్ .

క్రికెట్ అంటే క‌పిల్ దేవ్ , అజహ‌రుద్దీన్, స‌చిన్, గంగూలీ , ధోనీ, కోహ్లీ అని ఎలా చెబుతామో భార‌త మహిళా క్రికెట్ లో మాత్రం ఒకే ఒక్క పేరు ఎక్కువ‌గా వినిపించింది మాత్రం మిథాలీ రాజ్. ఆట‌లో ఆమె లీన‌మ‌య్యారు.

త‌న‌దైన ముద్ర వేశారు. త‌న‌ను తాను అద్భుతంగా మ‌ల్చుకున్నారు. ఆట అన్నాక ఒడిదుడుకులు స‌హ‌జం. వివాదాలు ఉండ‌నే ఉంటాయి. వీట‌న్నింటిని త‌ట్టుకుని మిథాలీ రాజ్ ముందుకే వెళ్లారు.

త‌న కెరీర్ ను అజేయ సెంచ‌రీతో స్టార్ట్ చేసింది. అదే ఆట‌ను ఆఫ్ సెంచ‌రీతో ముగించింది. ఇది కూడా ఓ రికార్డే న‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. 1999 జూన్ 26న ఐర్లాండ్ తో త‌న కెరీర్ స్టార్ట్ చేసింది.

2022 మార్చి 27న సౌతాఫ్రికా జ‌ట్టుతో 68 ప‌రుగులు చేసింది. మొత్తంగా త‌న కెరీర్ లో 23 ఏళ్ల పాటు ఆడింది. ఇక మిథాలీ రాజ్(Mithali Raj)  కెరీర్

ప‌రంగా చూస్తే 232 వ‌న్డేలు ఆడింది. 7 వేల 805 ప‌రుగులు చేసింది.

అత్య‌ధిక స్కోర్ 125 నాటౌట్ . ఇందులో 7 సెంచ‌రీలో 64 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. స‌గ‌టు 50.68 శాతం. 64 క్యాచ్ లు ప‌ట్టింది 8 వికెట్లు తీసింది. టెస్టుల ప‌రంగా చూస్తే 12 టెస్టులు ఆడి 699 ర‌న్స్ చేసింది.

అత్య‌ధిక స్కోర్ 214 కాగా ఒక సెంచ‌రీ 4 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. 12 క్యాచ్ లు ప‌ట్టుకుంది. ఇక టీ20 విష‌యానికి వ‌స్తే మొత్తం 89 మ్యాచ్ లు ఆడింది. 2, 364 ప‌రుగులు చేసింది.

అత్య‌ధిక స్కోర్ 97 నాటౌట్ . స‌గ‌టు 37.52 గా ఉంది. ఇందులో 17 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. ఇక ఎన్నో అవార్డులు ఆమెను వ‌రించాయి. భార‌త ప్ర‌భుత్వం ప‌ద్మ‌శ్రీ‌తో గౌర‌వించింది.

Also Read : స‌ఫారీతో యుద్దానికి భార‌త్ రెడీ

Leave A Reply

Your Email Id will not be published!