Mithali Raj Book Reading : చ‌ద‌వ‌డం అంటే చ‌చ్చేంత ఇష్టం

మిథాలీ రాజ్ బుక్ ల‌వ‌ర్

Mithali Raj Book Reading : భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను క‌లిగిన హైద‌రాబాదీ మిథాలీ రాజ్ సుదీర్ఘ క్రికెట్ ప్ర‌యాణం నుంచి నిష్క్ర‌మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఆమె క్రికెట‌ర్ గానే కాదు యావ‌త్ మ‌హిళా లోకానికి ఆద‌ర్శ ప్రాయంగా నిలిచారు. పురుషాధిక్య క్రికెట్ ప్ర‌పంచంలో అనామ‌కురాలిగా ఎంట్రీ ఇచ్చింది.

తానే ఓ శ‌క్తిగా ఎదిగింది మిథాలీ రాజ్.

ఒక‌ప్పుడు ఆడేందుకు డ‌బ్బుల కోసం ఇబ్బంది ప‌డిన ఈ మ‌హిళా క్రికెట‌ర్ కోట్లు సంపాదించే స్థాయికి చేరుకుంది. త‌న జీవితాన్ని సినిమాగా చేసే స్థాయికి త‌న‌ను తాను మ‌ల్చుకుంది.

1999లో ప్రారంభ‌మైన మిథాలీ రాజ్ క్రికెట‌స్ ప్ర‌స్థానం 8 జూన్ 2022తో ముగిసింది. ఈ మేర‌కు ట్విట్ట‌ర్ వేదిక‌గా తాను క్రికెట్ ఆట నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

కోట్లాది క్రీడాభిమానుల‌ను విస్తు పోయేలా చేసింది. త‌రాలు మారాని , ఫార్మాట్ లు మారినా త‌న‌దైన ఆట తీరుతో భార‌త క్రికెట్ పై చెర‌గ‌ని ముద్ర వేసింది.

ఆమె పేరుతో ఎన్నో రికార్డులు ఉన్నాయి. ఇదే స‌మ‌యంలో కెప్టెన్ గా ప్ర‌పంచ క‌ప్ క్రికెట్ ఫైన‌ల్ కు రెండుసార్లు చేర్చిన ఘ‌న‌త కూడా మిథాలీ రాజ్ పేరు మీదే ఉంది.

మొత్తం కెరీర్ లో వ‌ర‌ల్డ్ లోనే 10,000 ప‌రుగులు చేసి ఆల్ టైమ్ క్రికెట‌ర్ గా చ‌రిత్ర సృష్టించింది. ఆట అన్నాక పోటీ ఉంటుంది. ఇబ్బందులు, ఆటుపోట్లు, అవ‌మానాలు, ఒత్తిళ్లు అనేకం. ప్ర‌త్యేకించి ప్లేయ‌ర్ గా కంటే కెప్టెన్ గా ఇంకా ఒత్తిడి అధికంగా ఉంటుంది.

వాట‌న్నింటిని త‌ట్టుకుని నిల‌బ‌డాలంటే ఒక్కో ఆట‌గాడు, క్రీడాకారిణి ఒక్కో ప‌ద్ద‌తిని ఆశ్ర‌యిస్తారు. కానీ మిథాలీ రాజ్ మాత్రం వెరీ వెరీ స్పెషల్.

టెక్నాల‌జీ పెరిగిన ఈ త‌రుణంలో ప్ర‌తి ఒక్క‌రు మొబైల్స్ లో మునిగి పోతే ఆమె మాత్రం త‌న‌కు ఏ మాత్రం స‌మ‌యం చిక్కినా వెంట‌నే మంచి

పుస్త‌కాల‌ను త‌న వెంట తెచ్చుకునేంది.

మైదానం లోప‌ల త‌ను బ్యాటింగ్ దిగే స‌మ‌యం వ‌చ్చేంత వ‌ర‌కు పుస్త‌కాన్ని(Mithali Raj Book Reading) చ‌దవ‌డం చేసింది. పుస‌క్తాలు చ‌దివితే కోల్పోయిన జీవితం ఏమిటో తెలుస్తుంది.

మ‌న‌ల్ని మ‌నం తెలుసుకునేందుకు దోహదం చేస్తుంది అంటూ ఉంటుంది మిథాలీ రాజ్(Mithali Raj Book). పుస్త‌కాలు లేకుండా నేనుండ లేను

అవి నాకు దారులు చూపిస్తాయ‌ని, ఇవే త‌న‌కు చోద‌క శ‌క్తిగా మార్చాయ‌ని అంటోంది. చ‌ద‌వ‌డం మ‌రిచి పోయిన వాళ్ల‌కు ఆమె ఓ ఐకాన్.

Also Read : ఆట‌కే వ‌న్నె తెచ్చిన అందం

Leave A Reply

Your Email Id will not be published!