IND vs SA 1St ODI : స్వదేశంలో ఢిల్లీ వేదికగా జరిగిన తొలి టి20 మ్యాచ్ లో భారత్(IND vs SA 1St ODI) చేతులెత్తేసింది. కిల్లర్ మిల్లర్ షాన్
దార్ ఇన్నింగ్స్ ఆడితే డసెస్ జోర్దార్ ఆట తీరుతో ఆకట్టుకున్నాడు.
ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు భారీ స్కోర్ చేసినా అలవోకగా ప్రత్యర్థి సౌతాఫ్రికా జట్టు ఛేదించింది. ఏకంగా 7 వికెట్ల తేడాతో గ్రాండ్
విక్టరీ సాధించింది.
భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 211 రన్స్ చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. 48 బంతుల్లో 76 రన్స్ చేశాడు. ఇందులో 11 ఫోర్లు 3 సిక్సర్లు ఉన్నాయి.
హార్దిక్ పాండ్యా 12 బంతుల్లో 31 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 2 ఫోర్లు 3 సిక్సర్లు ఉన్నాయి. కెప్టెన్ పంత్ 16 బంతులు ఆడి 29
పరుగులు చేశాడు.
ఇందులో 2 ఫోర్లు 2 సిక్సర్లు ఉన్నాయి. అనంతరం బరిలోకి దిగిన సౌతాఫ్రికా(IND vs SA 1St ODI) 19.1 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్ఓయి 212 రన్స్ చేసి విజయం సాధించింది.
డసెన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 46 బంతుల్లో 7 ఫోర్లు 5 సిక్సర్లతో 75 రన్స్ చేసి రెచ్చి పోయాడు. భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు.
ఇక ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్ ) 2022లో రాణించిన కిల్లర్ మిల్లర్ తన హవా కొనసాగించాడు. కేవలం 31 బంతులు మాత్రమే ఆడిన
మిల్లర్ 64 రన్స్ చేశాడు.
4 ఫోర్లు 5 సిక్సర్లు ఉన్నాయి. వీరిద్దరూ నాలుగో వికెట్ కు కేవలం 64 బాల్స్ ఆడి 131 రన్స్ చేశారు. సఫారీ జట్టు అత్యధిక టార్గెట్ ను ఛేదించింది.
ఇక విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడిన మిల్లర్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
Also Read : కిల్లర్ ఇన్నింగ్స్ ఆడిన మిల్లర్