IPL Media Rights : ఐపీఎల్ మీడియా రైట్స్ బ‌రిలో నువ్వా నేనా

$7.7 బిలియన్ల హ‌క్కుల కోసం పోరాటం

IPL Media Rights : ప్ర‌పంచ క్రికెట్ లో ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్) ఓ సంచ‌ల‌నం. భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి వ‌చ్చే ఐదేళ్ల కాలానికి ఐపీఎల్ డిజిట‌ల్, మీడియా హ‌క్కుల(IPL Media Rights) కోసం వేలం పాట నిర్వ‌హిస్తోంది.

దీని ద్వారా రూ. 50,000 కోట్లు రానున్నాయ‌ని అంచ‌నా. ఇదే గ‌నుక జ‌రిగితే ప్ర‌పంచంలోనే టాప్ లీగ్ ల‌లో ఐపీఎల్ నాలుగోదిగా నిలుస్తుంది. ఈనెల

12న ప్రారంభ‌మై 13న ముగుస్తుంది.

నాలుగు కేట‌గిరీలుగా విభ‌జించింది బీసీసీఐ. ఇప్ప‌టికే ఏర్పాట్లు పూర్త‌య్యాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా దిగ్గ‌జ కంపెనీలు వేలం పాట‌లో పాల్గొనున్నాయి.

స్టార్, డిస్నీ, సోనీ, ఎస్సెల్ గ్రూప్ తో పాటు ప్ర‌ముఖ ఈకామ‌ర్స్ కంపెనీ అమెజాన్ , రిల‌య‌న్స్ గ్రూప్ సంస్థ‌లు కూడా బ‌రిలో ఉండ‌నున్నాయి.

ఇప్ప‌టికే ఆసియాలో అత్యధిక ధ‌న‌వంతుడిగా ఉన్న అంబానీ వ‌యాకామ్ పేరుతో ఇప్ప‌టికే ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. ఇదిలా ఉండ‌గా త్వ‌ర‌లోనే అమెరికాలో సైతం ఐపీఎల్ నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు కొన‌సాగుతున్నాయి.

అక్క‌డ మైక్రోసాఫ్ట్, త‌దిత‌ర దిగ్గ‌జ కంపెనీలు పెట్టుబ‌డులు పెట్టాయి. ఇక ఫ్యూచ‌ర్ గ్రూప్ తో భార‌త దేశంలో అమెజాన్ వ‌ర్సెస్ రిల‌య‌న్స్ గా మారింది.

ఈ త‌రుణంలో వ‌ర‌ల్డ్ మార్కెట్ లో ఎక్కువ భాగం ఇండియా నుంచే ఉంది.

ఇక ఇక్క‌డ క్రికెట్ అంటే ఓ మ‌తం. దీనిని మార్కెట్ చేసుకోవాల‌ని ఇరు కంపెనీలు భావిస్తున్నాయి. దీంతో ఎంత ఖ‌ర్చు అయినా స‌రే వెచ్చించేందుకు వెనుకాడ‌డం లేదు అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ ,

రిల‌య‌న్స గ్రూప్ చైర్మ‌న్ ముకేష్ అంబానీ. కాగా ఈ ఇద్ద‌రు దిగ్గ‌జాలు $7.7 బిలియ‌న్ల క్రికెట్ ప్ర‌సార హ‌క్కుల(IPL Media Rights) కోసం పోటీ

ప‌డ‌నున్నారు. దీంతో వేలం పాట మ‌రింత ర‌స‌వ‌త్త‌రం కానుంది.

600 మిలియ‌న్ల వీక్ష‌కుల‌ను ఆక‌ర్షించే , దాదాపు $6 బిలియ‌న్ల బ్రాండ్ వాల్యూను క‌లిగి ఉంది ఐపీఎల్. ఐదేళ్ల టెలికాస్టింగ్ , ఆన్ లైన్ స్ట్రీమింగ్

కాంట్రాక్ట్ కోసం అనేక మంది బిడ్డ‌ర్ల‌ను ఆక‌ర్షించే వీలుంది.

ఎలాగైనా స‌రే చేజిక్కించు కోవాల‌న్న క‌సితో ఉన్న ఇద్ద‌రు కుబేరుల్లో ఎవ‌రి ప‌రం అవుతుందో చూడాలి.

Also Read : అబ్బా వాన్ డెర్ డసెన్ దెబ్బ

Leave A Reply

Your Email Id will not be published!