Zaheer Khan : రిషబ్ పంత్ కెప్టెన్సీపై జహీర్ ఫైర్
బౌలర్లను వాడుకోవడంలో విఫలం
Zaheer Khan : స్వదేశంలో సఫారీ టీంతో జరుగుతున్న 5 మ్యాచ్ ల టీ20 సీరీస్ లో భారత జట్టు ఒక మ్యాచ్ ఓడి పోయింది. ప్రధాన ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ ప్రీత్ బుమ్రా ను బీసీసీఐ సెలెక్షన్ కమిటీ పక్కన పెట్టింది.
వారికి రెస్ట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇక రోహిత్ శర్మ స్థానంలో కేఎల్ రాహుల్ ను నియమించింది. ఇక నెట్స్ ప్రాక్టీస్ సందర్భంగా రాహుల్ కు గాయం కావడంతో అతడి స్థానంలో ఢిల్లీ ఆటగాడు రిషబ్ పంత్ ను ఎంపిక చేసింది బీసీసీఐ.
ఈ తరుణంలో జరిగిన మొదటి మ్యాచ్ లో ఇషాన్ కిషన్ , పాండ్యా, పంత్ రాణించారు. 211 పరుగుల భారీ స్కోర్ చేసినా ప్రత్యర్థి జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది.
ప్రధానంగా వారెన్ డెన్ డసెన్ , డేవిడ్ మిల్లర్ దుమ్ము రేపారు. భారత బౌలర్లకు చుక్కలు చూపించారు. ప్రధానంగా హర్షల్ పటేల్ వేసిన 17వ ఓవర్ లో డసెన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
ఏకంగా ఆ ఒక్క ఓవర్ లోనే 22 పరుగులు పిండుకున్నాడు. ఇక మిల్లర్ భారీ సిక్సర్లు, ఫోర్లతో రెచ్చి పోయాడు.
ప్రధానంగా బౌలర్ల ప్రదర్శన మరీ చెత్తగా ఉందని, స్పిన్నర్లను కెప్టెన్ రిషబ్ పంత్ సరిగా వాడు కోలేదని మండి పడ్డాడు భారత క్రికెట్ జట్టు మాజీ బౌలర్ జహీర్ ఖాన్(Zaheer Khan).
శ్రేయస్ అయ్యర్ సులభమైన క్యాచ్ ను వదిలి వేయడం కూడా జట్టు ఓటమిపై ప్రభావం చూపిందని పేర్కొన్నాడు.
ఆఖరులో యజ్వేంద్ర చాహల్ తో ఎందుకు బౌలింగ్ చేయించ లేదంటూ ప్రశ్నించాడు మాజీ క్రికెటర్.
Also Read : 21 మందితో శ్రీలంక వన్డే జట్టు డిక్లేర్