Subhash Chandra : మీడియా దిగ్గ‌జం అప‌జ‌యం

సుభాష్ చంద్ర‌కు బిగ్ షాక్

Subhash Chandra : రాజ‌స్తాన్ రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో అనూహ్యంగా బ‌రిలోకి దిగిన భార‌తీయ మీడియా దిగ్గ‌జం ఎస్సెల్ (జీ) గ్రూప్ సంస్థ‌ల చైర్మ‌న్ సుభాష్ చంద్ర‌కు (Subhash Chandra) బిగ్ షాక్ త‌గిలింది.

రాజ‌కీయాలు వేరు మీడియా ప్ర‌భావం వేరు అని తెలిసొచ్చింది. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ ప్ర‌క‌టించిన త‌ర్వాత ఊహించని రీతిలో కేంద్రంలో అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీ అంత‌ర్గ‌త మ‌ద్ద‌తుతో ఎంట్రీ ఇచ్చారు సుభాష్ చంద్ర‌.

చివ‌రి వ‌ర‌కు ఆయ‌న గెలిచేందుకు ప్ర‌య‌త్నం చేశారు. పావులు క‌దిపారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సైతం మ‌ద్ద‌తు పొందారు.

కానీ ఆఖ‌రులో కాంగ్రెస్ కొట్టిన దెబ్బ‌కు ఆయ‌న ఓట‌మి పాల‌య్యారు. ఇదిలా ఉండ‌గా మ‌రో మీడియా బ్యారన్ హ‌ర్యానాలో గెలుపొంద‌డం విశేషం.

మొత్తం దేశ వ్యాప్తంగా 15 రాష్ట్రాల‌లో 57 సీట్లకు నోటిఫికేష‌న్ వెలువ‌డింది. ఇందులో 41 సీట్లు ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు రాజ్య‌స‌భ ఎంపీలుగా. ఇక హ‌ర్యానా, క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర‌, రాజ‌స్థాన్ రాష్ట్రాల‌లో మొత్తం 16 సీట్ల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి.

మొత్తంగా ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ, దాని మిత్ర‌ప‌క్షాల‌కు కోలుకోలేని దెబ్బ త‌గిలింది. ప్ర‌ధానంగా మ‌హారాష్ట్రంలో శివ‌సేన పార్టీకి చెందిన సంజ‌య్ ప‌వార్ ఓడి పోగా బీజేపీ ఆ సీటును గెలుచుకుంది.

ఇక రాజ‌స్థాన్ లో 4 సీట్ల‌కు గాను 3 సీట్ల‌లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థులు గెలుపొందారు. బీజేపీకి చెందిన అభ్య‌ర్థి ఒక దానిలో విజ‌యం సాధించారు.

ఇద్ద‌రు బీజేపీ స‌భ్యులు క్రాస్ ఓటింగ్ కు పాల్ప‌డ‌డంతో జీ మీడియా దిగ్గ‌జం సుభాష్ చంద్ర (Subhash Chandra) ఓట‌మి పాల‌య్యారు. ఇది కోలుకోలేని షాక్ ఇచ్చింది ఆయ‌న‌కు.

Also Read : ఈసీ స‌హ‌కారం బీజేపీ విజ‌యం – రౌత్

Leave A Reply

Your Email Id will not be published!