IND vs SA 2nd T20 : సౌతాఫ్రికా జోరు భారత్ బేజారు
తొలి మ్యాచ్ లో ఓటమితో తీవ్ర ఒత్తిడి
IND vs SA 2nd T20 : స్వదేశంలో దక్షిణాఫ్రికాతో రెండో(IND vs SA 2nd T20) కీలక మ్యాచ్ జరగనుంది. ఢిల్లీలో జరిగిన తొలి టి20 మ్యాచ్ లో సత్తా చాటినా బౌలింగ్ లో చెత్త ప్రదర్శన కారణంగా చేతులెత్తేసింది. 211 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన సఫారీ జట్టు చుక్కలు చూపించింది.
మిస్టర్ కిల్లర్ డేవిడ్ మిల్లర్ దుమ్ము రేపాడు. డసెన్ చెలరేగాడు. 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించి జోరు మీదుంది. భారత బౌలర్లపై దాడికి దిగారు ఈ ఆటగాళ్లు. ఐదు టి20 మ్యాచ్ ల సీరీస్ లో 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది సఫారీ టీం.
ఇక భారత జట్టుకు సంబంధించి బ్యాటర్లు బాగా రాణించినా బౌలర్ల కారణంగా చేతులెత్తేసింది. పోయిన పరువు కాపాడుకునేందుకు ఆటగాళ్లు రెడీ అయ్యారు. ఇక మొదటి మ్యాచ్ లోనే శుభారంభం చేసిన సఫారీ టీం.
ఇదిలా ఉండగా ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగనుంది. ఇషాన్ కిషన్ , పాండ్యా , శ్రేయస్ అయ్యర్ , రిషబ్ పంత్ రాణించారు.
వీరంతా మళ్లీ ఆడితే భారీ స్కోర్ చేసే చాన్స్ ఉంది. భువనేశ్వర్ కుమార్ , హర్షల్ పటేల్ తీవ్ర నిరాశ పరిచారు. భారీగా పరుగులు సమర్పించుకున్నారు.
మిల్లర్, డసెన్ దంచి కొట్టారు. ప్రధానంగా రిషబ్ పంత్ నాయకత్వ లోపం కనిపించింది. బౌలర్లను సరిగా వినియోగించుకోక పోవడంపై మాజీ ఆటగాళ్లు విమర్శలు కురిపించారు.
ఇక జట్ల పరంగా చూస్తే భారత్ జట్టుకు పంత్ కెప్టెన్ . కిషన్ , రుతురాజ్ , అయ్యర్, హార్దిక్ , కార్తీన్ , అక్షర్ , హర్షల్ , భువీ, అవేశ్ , చహాల్ ఆడతారు.
సౌతాఫ్రికా జట్టుకు తెంబా బవుమా కెప్టెన్. డికాక్, ప్రిటోరియస్ , డసెన్ , మిల్లర్ , స్టబ్స్ , పార్నెల్ , రబడ, నోర్టే, షమ్సీ, ఇంగిడి లేదా జాన్సెన్ ఆడతారు.
Also Read : పాకిస్తాన్ విక్టరీ బాబర్ ఆజం రికార్డ్