Sourav Ganguly : అజహరుద్దీన్..సచిన్ తో పోటీ పడలేదు
బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ
Sourav Ganguly : భారత క్రికెట్ మాజీ కెప్టెన్ , ప్రస్తుత భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ ) చీఫ్ సౌరవ్ గంగూలీ(Sourav Ganguly) షాకింగ్ కామెంట్స్ చేశారు.
తాను ఏనాడూ దిగ్గజ ఆటగాళ్లుగా పేరొందిన మహమ్మద్ అజహరుద్దీన్ , సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ లతో పోటీ పడాలని అనుకోలేదన్నాడు.
తాను ఎలాంటి ప్రయత్నం చేయలేదన్నారు. ఈ ముగ్గురితో కలిసి ఆడాను కానీ అజ్జూ భాయ్ మాత్రం వెరీ స్పెషల్ అని పేర్కొన్నాడు దాదా.
ఇదిలా ఉండగా ప్రపంచంలోనే టాప్ ప్లేయర్ గా, అద్భుతమైన కెప్టెన్ గా పేరొందాడు సౌరవ్ గంగూలీ. బెంగాల్ టైగర్ గా పేరొందిన ఈ క్రికెటర్ అజ్జూ సారథ్యంలో ఎంట్రీ ఇచ్చాడు.
ముగ్గురు ఆటగాళ్లు అత్యంత నైపుణ్యం, ప్రతిభ కలిగిన వాళ్లని కితాబు ఇచ్చాడు. ఆటగాడి నుంచి కెప్టెన్ గా ఎదిగినా నా మూలాలు మరిచి పోలేదన్నారు.
ఆ ముగ్గురితో కలిసి ఆడాను. కానీ వారితో ఏనాడూ పోటీ పడలేదన్నాడు. నాదైన ఆట తీరుతో నేను ముందుకు వెళ్లగలిగానని చెప్పాడు. అయితే అజ్జూ సహకారం మరువలేనని పేర్కొన్నాడు గంగూలీ(Sourav Ganguly) .
ఆ ముగ్గురికి తాను సహకరించానని తెలిపాడు. ఇదిలా ఉండగా ది ఎకనామిక్ టైమ్స్ ఇండియా లీడర్ షిప్ కౌన్సిల్ నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో సిఇఓ దీపక్ లాంబాతో జరిగిన సంభాషణలో సౌరవ్ గంగూలీ ఈ విషయం చెప్పాడు.
గొప్ప ఆటగాళ్లతో తాను ఆడానని తెలిపాడు. కాలక్రమేణా క్రికెట్ వాస్తవ పరివర్తనను చూశానని, జట్టులో ప్రతిభకు కొరత లేదని గ్రహించినట్లు చెప్పాడు గంగూలీ. జట్టును నడిపించడం ఒక ఎత్తు బీసీసీఐని నిర్వహించడం మరో ఎత్తు అని పేర్కొన్నాడు.
Also Read : ఐపీఎల్ మీడియా రైట్స్ కోసం ఉత్కంఠ