Dasun Shanaka : అబ్బా దసున్ షనక దెబ్బ
ఆసిస్ పై శ్రీలంక గ్రాండ్ విక్టరీ
Dasun Shanaka : వరుస విజయాలతో జోరుమీదున్న ఆస్ట్రేలియాలకు కోలుకోలేని షాక్ తగిలింది. శ్రీలంక కెప్టెన్ దసున్ షనక సెన్సేషన్ ఇన్నింగ్స్ ఆడాడు. కళ్లు చెదిరే షాట్లతో అలరించాడు. తానే చివరి దాకా ఉండి జట్టును గెలిపించాడు.
ఓటమి ఖరారైందని బాధ పడిన శ్రీలంక అభిమానులకు ఊహించని రీతిలో విజయాన్ని చేకూర్చి పెట్టాడు షనక. దసున్ కొట్టిన దెబ్బకు
ఆసిస్ ఆటగాళ్లు నీళ్లు నమిలారు.
శ్రీలంకలోని పల్లెకెల్ లో జరిగిన మూడో టీ20 మ్యాచ్ ఆద్యంతం రసవత్తరంగా సాగింది. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన షనక దెబ్బకు శ్రీలంక ఆసిస్ పై
4 వికెట్ల తేడాతో చిరస్మరణీయమైన విజయాన్ని నమోదు చేసింది.
దసున్ షనక కేవలం 24 బంతులు మాత్రమే ఆడాడు. 54 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇది చివరి మ్యాచ్ కావడం విశేషం. అత్యంత
నాటకీయంగా ముగిసింది ఈ గేమ్. ఏకంగా తన ముందు ఆసిస్ ఉంచిన 177 పరుగుల భారీ లక్ష్యాన్ని చేదించింది.
ఒకానొక సమయంలో శ్రీలంక జట్టు 17వ ఓవర్ ముగిసే సమయానికి 118 పరుగులు చేసింది. అప్పటికే ఆరు వికెట్లు కోల్పోయింది. ఇక ఈ మ్యాచ్ లో విజయం సాధించాలంటే శ్రీలంక 3 ఓవర్లు 18 బంతులు 59 పరుగులు చేయాల్సి ఉంది.
ఈ తరుణంలో కెప్టెన్ దసున్ షనక (Dasun Shanaka) రెచ్చి పోయాడు. జోష్ హేజిల్ వుడ్ కు చుక్కలు చూపించాడు. 21 పరుగులు రాబట్టాడు. ఝై రిచర్డ్ సన్ వేసిన
చివరి ఓవర్ లో మూడు బౌండరీలు బాదాడు.
కేన్ పై వరుసగా మూడు బంతుల్లో 4, 4, 6 పరుగులు చేశాడు. దీంతో శ్రీలంక థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. మొత్తం పరుగుల్లో 5 ఫోర్లు 4 సిక్సర్లు ఉన్నాయి.
ఇక కెప్టెన్ దసున్ షనక(Dasun Shanaka) కు 8వ నంబర్ అయిన కరుణరత్నే చక్కటి సహకారం అందించాడు. 10 బంతులు ఆడి 2 ఫోర్లతో 14 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
Also Read : అజహరుద్దీన్..సచిన్ తో పోటీ పడలేదు