SL vs AUS 3rd T20 : అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు
శ్రీలంక కెప్టెన్ మారథాన్ ఇన్నింగ్స్
SL vs AUS 3rd T20 : ఇది ఊహించని పరిణామం. శ్రీలంకలో ఆసిస్ తో జరిగిన టీ20 మూడో మ్యాచ్ లో అద్భుతం చోటు చేసుకుంది. ఆ జట్టు కెప్టెన్ దసున్ షనక అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఓడి పోతుందనుకున్న మ్యాచ్ ను గెలిపించి చూపించాడు.
బహుశా ఇటీవల జరిగిన టీ20 మ్యాచ్ లలో ఇది అత్యుత్తమమైన మ్యాచ్ గా పరిగణించవచ్చు. మొదట బ్యాటింగ్ చేసిన ఆసిస్ 20 ఓవర్లలో 177 పరుగులు చేసింది. ఇక బరిలోకి దిగిన శ్రీలంక(SL vs AUS 3rd T20) జట్టు 118 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది.
అప్పటికీ 17 పూర్తయ్యాయి. ఆ సమయంలో 3 ఓవర్లు 18 బంతులు మాత్రమే ఉన్నాయి. చేయాల్సిన పరుగులు 59. ఎవరైనా అనుకుంటారా శ్రీలంక గెలుస్తుందని. కానీ చేసి చూపించాడు దసున్ షనక.
ఇప్పుడు యావత్ ప్రపంచం అతడు ఆడిన విధ్వంసకరమైన ఆట తీరును చూసి విస్తు పోతోంది. పోనీ అనామక జట్టుతో ఆడాడని అనుకుంటే పొరపాటు.
టి20 వరల్డ్ కప్ ఛాంపియన్ ఆస్ట్రేలియా. దిగ్గజ ఆటగాళ్లతో ఉన్న ఆ జట్టు బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఝై రిచర్డ్ సన్ , హాజిల్ వుడ్ కు షాక్ ఇచ్చాడు షనక.
కేవలం 24 బంతులు మాత్రమే ఆడాడు. ఏకంగా 58 రన్స్ చేశాడు. 4 వికెట్ల తేడాతో గెలుపొందేలా కీలక పాత్ర పోషించాడు. దీంతో ఆసిస్ సీరీస్ నెగ్గినా ఈ మ్యాచ్ లో సాధించిన విజయంతో శ్రీలంక హాట్ టాపిక్ గా మారింది.
తక్కువ బంతుల్లో భారీ స్కోర్ ను చేసిన షనక ఇవాళ హీరోగా మారాడు. అతడు ఆడిన షాట్స్ తో కూడిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read : అబ్బా దసున్ షనక దెబ్బ
Highlights of last 3 overs#Shanaka#SLvAUS#AUSvsSL https://t.co/YlidfL0Qyp pic.twitter.com/2hPuNfNoTE
— Ankit Chaudhary (@Ankit_Sihag_) June 12, 2022