Sabitha Indra Reddy : రేపటి నుంచి బడులు ప్రారంభం
ఇక నుంచి ఇంగ్లీషులో పాఠాలు
Sabitha Indra Reddy : కరోనా కేసులు మరోసారి భారీగా పెరుగుతుండడం, తెలంగాణ వైద్య శాఖ డైరెక్టర్ జాగ్రత్తగా ఉండాలని సూచించడంతో అంతా స్కూళ్లకు సంబంధించి సెలవులు పొడిగిస్తారని అనుకున్నారు.
పేరెంట్స్ , టీచర్స్ కూడా డిసైడ్ అయ్యారు. కానీ చావు కబురు చల్లగా చెప్పారు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా రెడ్డి(Sabitha Indra Reddy) . ఎలాంటి అనుమానం అక్కర్లేదని, ఇంతకు ముందు ప్రకటించినట్లుగానే సీఎం ఆదేశాల మేరకు ఈనెల 13 నుంచి రాష్ట్రంలో అన్ని స్కూళ్లను రీ ఓపెన్ చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇప్పటికే విద్యా శాఖ పుస్తకాలు, నోట్ బుక్స్, ఇతర మెటీరియల్ పంపించిందని తెలిపారు. ఆదివారం మంత్రి మీడియాతో మాట్లాడారు. సెలవులకు సంబంధించి పొడిగింపు అన్నది ఉండబోదని స్పష్టం చేశారు.
టీచర్లు రేపటి నుంచి బడులకు వెంటనే వెళ్లాల్సిందేనని పేర్కొన్నారు. ఏ మాత్రం ఆలస్యం చేసినా, నిర్లక్ష్యం ప్రదర్శించినా ఊరుకో బోమన్నారు.
ఇక అన్ని పాఠశాలలో ఈ ఏడాది నుంచి ఇంగ్లీష్ మీడియంలో పాఠాలు బోధించడం జరుగుతుందని చెప్పారు. ఇందుకు గాను ఇప్పటికే ఆయా పాఠశాలలలో పని చేస్తున్న టీచర్లకు ఆంగ్లంలో బోధించే సామర్థ్యానికి సంబంధించి శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు.
ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా విద్యార్థులను తీర్చి దిద్దాల్సిన బాధ్యత పంతుళ్లపై ఉంటుందన్నారు మంత్రి. కరోనా ఉన్నా లేకున్నా ఇక బడులు మాత్రం ప్రారంభించనుంది తెలంగాణ రాష్ట్ర సర్కార్.
ఇదిలా ఉండగా ఈనెల 13న తిరిగి పాఠశాలలు తెరవాలని విద్యా శాఖకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని స్పష్టం చేశారు సబితా ఇంద్రా రెడ్డి(Sabitha Indra Reddy) .
Also Read : 13 నుంచే బడులు ప్రారంభం