Sonia Gandhi : ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ
పరిస్థితి నిలకడగా ఉందన్న కాంగ్రెస్
Sonia Gandhi : కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ కరోనా కారణంగా ఆదివారం ఆస్పత్రిలో చేరారు. ఆమెకు కరోనా రెండోసారి సోకింది. సోనియా ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా ఈనెల 2న సోనియాకు కరోనా వైరస్ టెస్ట్ చేయించారు. ఆమెకు పాజిటివ్ అని తేలింది. కరోనా కారణంగా తాను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరు కాలేనని ఇప్పటికే స్పష్టం చేశారు సోనియా గాంధీ(Sonia Gandhi).
గతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేషనల్ హెరాల్డ్ పత్రిక నిర్వహణలో మనీ లాండరింగ్ జరిగిందంటూ ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో కేసు కొట్టి వేశారు. సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీకి క్లీన్ చిట్ ఇచ్చారు.
కాగా భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రముఖ న్యాయవాది, మాజీ ఎంపీ సుబ్రమణ్య స్వామి మరోసారి ఈ కేసును తిరగదోడారు. దీంతో సీబీఐ ఆయన చేసిన ఫిర్యాదుల ఆధారంగా కేసు నమోదు చేసింది.
ఈడీ రంగంలోకి దిగింది. కేసుకు సంబంధించి తమ ముందు హాజరు కావాలని కోరుతూ సమన్లు జారీ చేసింది సోనియా, రాహుల్ కు. కరోనా కారణంగా రాలేనంటూ పేర్కొనడంతో ఈడీ ఓకే చెప్పింది.
ఇక రాహుల్ గాంధీ విచారణకు హాజరవుతారని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. కోవిడ్ సమస్యల కారణంగా సోనియా ఆస్పత్రిలో చేరారని తెలిపింది.
అయితే కేంద్రంలోని బీజేపీ సంకీర్ణ సర్కార్ కావాలని సోనియా(Sonia Gandhi), రాహుల్ ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు పార్టీ ప్రతినిధి రణ్ దీప్ సూర్జేవాలా.
Also Read : గ్రామ స్వరాజ్యం దేశానికి ఆదర్శం