Owaisi Yogi : యూపీలో కూల్చివేతలపై ఓవైసీ ఫైర్
యోగి సీఎం తో జడ్జీ కూడా అయ్యారు
Owaisi Yogi : మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నూపుర్ శర్మ , నవీన్ జిందాల్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి.
యూపీలో అల్లర్లకు పాల్పడిన వారిని, సపోర్ట్ చేసిన వారిపై ఉక్కుపాదం మోపారు సీఎం యోగి ఆదిత్యానాథ్. కొందరు నేతల ఇళ్లను కూల్చి వేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.
ఆయన చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని జడ్జీగా కూడా మారారంటూ ఆరోపణలు చేశారు. ఇదిలా ఉండగా బుల్ డోజర్లతో కూల్చి వేతలకు పాల్పడిన సమయంలో ఇంట్లో అక్రమ ఆయుధాలు, అభ్యంతరకర పోస్టర్లు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.
ప్రయాగ్ రాజ్ హింసాకాండలో ప్రధాన నిందితుడి ఇంటిని కూల్చి వేయడంపై సీఎంపై ఓవైసీ(Owaisi Yogi) సీరియస్ అయ్యారు. ఆయన అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లాగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు.
ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తూ, కేసులు నమోదు చేస్తూ దోషిగా మీరే నిర్ణయిస్తారా అని నిలదీశారు. గుజరాత్ లోని కచ్ లో జరిగిన ర్యాలీలో అసదుద్దీన్ ఓవైసీ యోగి ఆదిత్యానాథ్ నిప్పులు చెరిగారు.
ఇదిలా ఉండగా ప్రయాగ్ రాజ్ డెవలప్ మెంట్ అథారిటీ (పీడీఏ) భారీ పోలీసు మోహరింపు మధ్య ఈనెల 10న జరిగిన హింసాకాండకు ప్రధాన సూత్రధారిగా జావెద్ మహ్మద్ అలియాస్ ఇంటిని కూల్చి వేశారు.
నిందితుడు వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా నేత, కార్యకర్త ఆఫ్రీన్ ఫాతిమా తండ్రి. గత ఏడాది కేంద్రం వివాదాస్పద పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో ఆమె కీలక పాత్ర పోషించారు.
ఈ హింసలో ఫాతిమా పాత్రపై కూడా విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read : యూపీ అల్లర్లలో 300 మంది అరెస్ట్