ENG vs NZ 2nd Test : జో రూట్ జోర్దార్ పోప్ సూప‌ర్

డ్రా దిశ‌గా సాగుతున్న రెండో టెస్టు

ENG vs NZ 2nd Test : ఇంగ్లాండ్ స్టార్ హిట్ట‌ర్ , మాజీ కెప్టెన్ జో రూట్ మ‌రోసారి దుమ్ము రేపాడు. న్యూజిలాండ్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. వ‌రుస‌గా రెండో సెంచ‌రీ సాధించి స‌త్తా చాటాడు.

అత్యంత వేగ‌వంత‌మైన సెంచ‌రీతో అరుదైన ఘ‌న‌త సాధించాడు. స్టార్ క్రికెట‌ర్లు విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్ ల‌తో స‌మానంగా నిలిచాడు. ఈ శ‌త‌కంతో 27 టెస్టు సెంచ‌రీలు చేశాడు. మొద‌టి టెస్టులో 10,000 ల ప‌రుగులు పూర్తి చేశాడు.

రికార్డ్ బ్రేక్ చేశాడు. ట్రెంట్ బ్రిడ్జ్ లో న్యూజిలాండ్(ENG vs NZ 2nd Test) తో జ‌రిగిన రెండో టెస్టులో మూడో రోజు జో రూట్ అద్భుత‌మైన ఇన్నింగ్స్ ఆడాడు. మ‌రోసారి క్లాసిక‌ల్ ఆట తీరుతో ఆక‌ట్టుకున్నాడు.

మొద‌ట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 553 భారీ ప‌రుగులు చేసింది. అనంత‌రం బ‌రిలోకి దిగిన ఇంగ్లాండ్(ENG vs NZ 2nd Test) జ‌ట్టు ఒల్లీ పోప్ , జో రూట్ ఇంగ్లాండ్ స్కోర్ ను పెంచ‌డంలో కీల‌క పాత్ర పోషించారు.

పోప్ రెండో టెస్ట్ సెంచ‌రీ చేశాడు. 239 బంతులు ఆడి 145 ర‌న్స్ చేశాడు. ఇక జో రూట్ 163 ర‌న్స్ చేశాడు. ఇంగ్లాండ్ గడ్డ‌పై మొద‌టి సెంచ‌రీ. కెప్టెన్ బెన్ స్టోక్స్ త‌ర్వాత మూడో ర్యాంక్ కు చేరుకున్నాడు.

2020లో ద‌క్షిణాఫ్రికాలో 135 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. గ‌త ఏడాదిన్న‌ర కాలంలో 10 సెంచ‌రీలు చేశాడు రూట్. ఆట ముగిసే స‌మ‌యానికి 5 వికెట్లు కోల్పోయి 475 ర‌న్స్ తో ముగించింది.

ఆలీ పోప్ , జో రూట్ న్యూజిలాండ్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించారు. ఇదిలా ఉండ‌గా జో రూట్ 200 బంతులు ఆడి 163 ప‌రుగులు చేశాడు.

Also Read : చెల‌రేగిన క్లాసెన్ ఇండియా ప‌రేషాన్

Leave A Reply

Your Email Id will not be published!