PAK vs WI 3rd ODI : విండీస్ కు షాక్ పాకిస్తాన్ క్లీన్ స్వీప్
మూడో వన్డే లోనూ గ్రాండ్ విక్టరీ
PAK vs WI 3rd ODI : పాకిస్తాన్ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఆ జట్టు అన్ని ఫార్మాట్ లలో రాణిస్తూ సత్తా చాటుతోంది. మూడో వన్డే లోనూ గ్రాండ్ విక్టరీ సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్ ను 48 ఓవర్లకు కుదిరించారు అంపైర్లు.
3-0తో క్లీన్ స్వీప్ చేసింది. కరోనా కారణంగా వాయిదా పడిన మిగతా మ్యాచ్ లోను విండీస్ మరోసారి పాకిస్తాన్ తో ఆడేందుకు వచ్చింది. ఈ జట్టుకు నికోలస్ పూరన్ కెప్టెన్ గా ఉన్నాడు.
ఇదిలా ఉండగా పాకిస్తాన్(PAK vs WI 3rd ODI) ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్ దంచి కొట్టాడు. ఏకంగా విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 86 పరుగులు చేసి సత్తా చాటాడు. పర్యాటక జట్టు ఆశలపై నీళ్లు చల్లాడు.
షాదాబ్ ఖాన్ తో పాటు ఓపెనర్లు ఫఖర్ జమాన్ 35 రన్స్ చేస్తే ఇమామ్ ఉల్ హక్ 62 పరుగులు చేసి దుమ్ము రేపారు. ఆఖరున వచ్చిన షాబాద్ బ్యాట్ కు పని చెప్పడంతో నిర్ణీత 48 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 269 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
అనంతరం 270 పరుగుల భారీ టార్గెట్ తో మైదానంలోకి దిగిన వెస్టిండీస్(PAK vs WI 3rd ODI) జట్టును పాక్ బౌలర్లు కట్టడి చేశారు. టాపార్డర్ ఆశించిన మేర రాణించ లేక పోయారు.
అందరూ చేతులెత్తేసిన సమయంలో ఏడో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన అకీల్ హుసేన్ పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతడు ఒక్కడే 60 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.
దీంతో 37.2 ఓవర్లలోనే విండీస్ చాప చుట్టేసింది. ఓటమి మూటగట్టుకుంది.
Also Read : భారత జట్టుకు భువీ అదనపు బలం