IPL Media Rights : రూ. 43,050 కోట్లు దాటిన ఐపీఎల్ వేలం
రూ. 50,000 కోట్లకు చేరుకునే అవకాశం
IPL Media Rights : భారత దేశ క్రీడా చరిత్రలో ఇది ఊహించని రికార్డుగా పేర్కొనక తప్పదు. క్రాడా ప్రపంచంలో అత్యధిక ఆదాయం కలిగిన లీగ్ లలో ఐపీఎల్(IPL Media Rights) కూడా నిలవబోతోంది.
ఐదేళ్ల కాలానికి గాను డిజిటల్, మీడియా రైట్స్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఐపీఎల్ ఈ వేలం ప్రారంభించింది. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన కంపెనీలతో పాటు భారత కంపెనీలు సైతం బరిలో ఉన్నాయి.
ఇప్పటికే ఐపీఎల్ కు సంబంధించి బీసీసీఐ రూ. 50, 000 వేల కోట్లు వస్తాయని ముందుగానే అంచనా వేసింది. అందుకు అనుగుణంగానే వేలం పాట కొనసాగుతోంది.
ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు డిజిటల్, మీడియా రైట్స్ రూ. 43,050 కోట్లు దాటడం విశేషం. ఐపీఎల్ మీడియా హక్కులు(IPL Media Rights) 2023 నుంచి 2027 కు గాను ఈ బిడ్ కొనసాగింది.
దేశంలోని అగ్రశ్రేణి క్రీడా ప్రసారకర్తలు తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఇందులో ముకేష్ అంబానీకి చెందిన వయా కామ్ 18 కూడా ఉంది. ప్రస్తుతం టీవ, డిజిటల్ తో కూడిన ప్యాకేజీ ఎ, బి రైట్స్ రూ. 43,050 కోట్లకు భారీ మొత్తానికి అమ్ముడు పోయినట్లు టాక్.
దీని ప్రకారం చూస్తే ఒక్కో మ్యాచ్ విలువ రూ. 100 కోట్లకు పైగా ఖర్చు కానుంది. ఇది భారతీయ క్రీడల్లో కనీ విని ఎరుగని రీతిలో సాధించిన బీసీసీఐ విజయం అని చెప్పక తప్పదు.
ఇప్పటికే ఈ వేలం నుంచి ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ తో పాటు టెక్ దిగ్గజం గూగుల్ తప్పుకున్నాయి. దీంతో వరల్డ్ వైడ్ గా ఉన్న కొన్ని కంపెనీలు పోటీ పడుతున్నాయి.
Also Read : రూ. 42,000 కోట్లు దాటిన ఐపీఎల్ వేలం