IPL Digital Rights : ఐపీఎల్ డిజిటల్ రైట్స్ అంబానీ చేతికి
బీసీసీఐకి ఊహించని రీతిలో ఆదాయం
IPL Digital Rights : కాదేదీ కవితకు అనర్హం అన్న కవి మాటల్ని నిజం చేస్తున్నాడు భారతీయ దిగ్గజ వ్యాపారవేత్త, ఆసియా ఖండంలో అత్యంత ధనవంతుడిగా పేరొందిన రిలయన్స్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ ముకేశ్ అంబానీ.
ఐపీఎల్ డిజిటల్(IPL Digital Rights), మీడియా హక్కులు 2023 నుంచి 2027 వరకు ఐదేళ్ల కాలానికి గాను డిజిటల్ రైట్స్ చేజిక్కించుకున్నారు. పారామౌంట్ గ్లోబల్ తో కలిసి వయా కామ్ 18 ( రిలయన్స్ ) జాయింట్ వెంచర్ ను సృష్టించారు.
దీనికి ఆస్ట్రేలియన్ మీడియా మొఘల్ గా పేరొందిన రూపర్ట్ మర్దోచ్ కుమారుడు జేమ్స్ మర్దోచ్ దే పారా మౌంట్ గ్లోబల్ కూడా. దీంతో ఐపీఎల్ డిజిటల్(IPL Digital Rights) హక్కుల్ని ఏకంగా $2.6 బిలియన్లకు పొందాడు.
అంటే భారతీయ రూపాయలలో వేల కోట్లు వచ్చి చేరాయి బీసీసీఐకి. ఇదే సమయంలో యుఎస్ బెహమెత్ డిస్నీకి చెందిన స్టార్ ఇండియా ప్రపంచంలో అత్యధికంగా వీక్షించే క్రీడా ఈవెంట్ లలో ఒకటైన ఐపీఎల్ తదుపరి ఐదు సీజన్ల టెలివిజన్ హక్కుల్ని పొందిందని మీడియా వర్గాలు వెల్లడించాయి.
ఈఈ రెండు డీల్ ల విలువ దాదాపు రూ. $5.65 బిలియన్లుగా అంచనా. మంగళవారం మరో రెండు ప్యాకేజీలను బీసీసీఐ మంగళవారం వేలం వేస్తోంది.
ఐపీఎల్ కు భారీ ఆదరణ ఉండడంతో ప్రపంచ వ్యాప్తంగా కాపీ క్యాట్ ఈవెంట్ లకు దారితీసింది. ఇదిలా ఉండగా యూరోపియన్ సాకర్ , అమెరికన్ ఫుట్ బాల్ హక్కుల కోసం వందల మిలియన్ డాలర్లు ఖర్చు చేసిన అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ మొదట్లో ఐపీఎల్ పట్ల ఆసక్తి కనబరిచారు. కానీ ఎందుకనో తప్పుకున్నారు.
Also Read : ఐసీసీ వన్డే ర్యాకింగ్స్ లో కీవీస్ టాప్