IND vs SA 3rd T20I : రాణించిన రుతురాజ్..ఇషాన్ కిష‌న్

సౌతాఫ్రికా టార్గెట్ 180 ప‌రుగులు

IND vs SA 3rd T20I : విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా జ‌రుగుతున్న మూడో కీల‌క 20 మ్యాచ్ లో భార‌త(IND vs SA 3rd T20I) జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 179 ప‌రుగులు చేసింది. దీంతో స‌ఫారీ జ‌ట్టు ముందు 180 ప‌రుగుల ల‌క్ష్యం ఉంచింది.

ఇప్ప‌టికే ఢిల్లీ, క‌ట‌క్ ల‌లో జ‌రిగిన మొద‌టి, రెండో మ్యాచ్ లు కోల్పోయింది టీమిండియా. ఇక ముందుగా బ్యాటింగ్ చేసిన భార‌త జ‌ట్టు ఓపెప‌ర్లు స‌త్తా చాటారు. స‌ఫారీ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించారు.

రుతురాజ్ గైక్వాడ్ 57 ప‌రుగులు రాణించాడు. ఇక ఇషాన్ కిష‌న్ మ‌రోసారి స‌త్తా చాటాడు. వ‌రుస‌గా మూడో మ్యాచ్ లోనూ దుమ్ము రేపాడు. 54 ప‌రుగులు చేసి భారీ భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు.

కానీ ఆ త‌ర్వాత ఇదే దూకుడును కంటిన్యూ చేయ‌లేక పోయారు. ప్ర‌ధానంగా భార‌త(IND vs SA 3rd T20I) జ‌ట్టు కెప్టెన్ రిష‌బ్ బంత్ మ‌రోసారి నిరాశ ప‌రిచాడు. ఓ వైపు కెప్టెన్ గా తీవ్ర విమ‌ర్శలు ఎదుర్కొంటుండ‌గా బ్యాటింగ్ పై కూడా ఫోక‌స్ పెట్ట‌లేక పోతున్నాడు.

దీంతో ఫ్యాన్స్ తో పాటు మాజీ ఆట‌గాళ్లు మండి ప‌డుతున్నారు. టాస్ ఓడి పోయి మంచి ఆరంభం ఇచ్చిన భార‌త జ‌ట్టు భారీ స్కోర్ సాధిస్తుంద‌ని అనిపించింది. కానీ తీరా స‌ఫారీ బౌల‌ర్లు ప‌ట్టు సాధించారు.

బ్యాట‌ర్ల‌ను ప‌రుగులు చేయ‌నీయ‌కుండా క‌ట్ట‌డి చేయ‌డంలో స‌క్సెస్ అయ్యారు. ఓపెనర్లు ఔట్ అయ్యాక వ‌చ్చిన శ్రేయ‌స్ అయ్య‌ర్ 14 ప‌రుగులు చేస్తే పంత్ 6 ర‌న్స్ చేసి పెవిలియ‌న్ బాట ప‌ట్టారు.

ఇక 19వ ఓవ‌ర్ లో దినేష్ కార్తీక్ నిరాశ ప‌రిచాడు. 6 ప‌రుగులే చేసి వెనుదిరిగాడు. మ‌రోసారి మెరిశాడు హార్దిక్ పాండ్యా. 31 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

Also Read : ఐసీసీ వ‌న్డే ర్యాకింగ్స్ లో కీవీస్ టాప్

Leave A Reply

Your Email Id will not be published!