IND vs SA 3rd T20I : తిప్పేసిన యుజ్వేంద్ర చాహ‌ల్..ప‌టేల్

48 ప‌రుగుల తేడాతో విక్ట‌రీ

IND vs SA 3rd T20I : హ‌మ్మ‌య్య ఎట్ట‌కేల‌కు టీమిండియా(IND vs SA 3rd T20I)  బోణీ కొట్టింది. అత్యంత పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో సౌతాఫ్రికాతో జ‌రిగిన టి20 సీరీస్ లో మొద‌టి, రెండో మ్యాచ్ ల‌ను వ‌రుస‌గా కోల్పోయింది.

ఈ త‌రుణంలో ఏపీలోని వైజాగ్ వేదిక‌గా జ‌రిగిన కీల‌కమైన మూడో టీ20 మ్యాచ్ లో విజ‌యం సాధించింది. ఇక సీరీస్ గెల‌వాలంటే ఈ మ్యాచ్ లో త‌ప్ప‌క ప‌ట్టు సాధించాల్సిన స‌మ‌యంలో జ‌ట్టు స‌మిష్టిగా రాణించింది.

మ్యాచ్ విష‌యానికి వ‌స్తే స‌ఫారీ కెప్టెన్ తెంబా బ‌వూమా మ‌రోసారి టాస్ గెలిచాడు. ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోవ‌డంతో భార‌త జ‌ట్టు బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 179 ప‌రుగులు చేసింది.

రుతురాజ్ గైక్వాడ్ 57 ర‌న్స్ చేస్తే ఇషాన్ కిషాన్ వ‌రుస‌గా మూడో మ్యాచ్ లో రాణించాడు. 54 ప‌రుగుల‌తో స‌త్తా చాటాడు.

ఇక జ‌ట్టు భారీ స్కోర్ సాధిస్తుంద‌ని అనుకున్న త‌రుణంలో బ‌రిలోకి దిగిన శ్రేయ‌స్ అయ్య‌ర్ , కెప్టెన్ రిష‌బ్ పంత్ , దినేష్ కార్తీక్ వ‌రుస‌గా పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో నిరాశ ప‌రిచారు.

దీంతో క్రీజులో ఉన్న హార్దిక్ పాండ్యా 31 ప‌రుగులు చేసి గ‌ట్టెక్కించాడు. అనంత‌రం 180 ప‌రుగుల ల‌క్ష్యంతో మైదానంలోకి వ‌చ్చిన సౌతాఫ్రికా జ‌ట్టు బ్యాట‌ర్ల‌ను బౌల‌ర్లు యుజ్వేంద్ర చాహ‌ల్ , హ‌ర్ష‌ల్ ప‌టేల్ లు చుక్క‌లు చూపించారు.

ప‌రుగులు చేయ‌కుండా క‌ట్ట‌డి చేశారు. ఏకంగా 48 ప‌రుగుల భారీ తేడాతో విక్ట‌రీ సాధించింది టీమిండియా. 19.1 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 131 ప‌రుగుల‌కే ఆలౌటైంది. కీల‌క‌మైన ఆట‌గాళ్ల‌ను అద్భుత బౌలింగ్ తో బోల్తా కొట్టించిన యుజ్వేంద్ర చాహ‌ల్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ద‌క్కింది.

Also Read : రాణించిన రుతురాజ్..ఇషాన్ కిష‌న్

Leave A Reply

Your Email Id will not be published!