IPL Media Rights : రూ. 48,390 కోట్లతో ఐపీఎల్ రైట్స్ రికార్డ్
భారత క్రీడా చరిత్రలో అద్భుతం
IPL Media Rights : కాసుల పంట పండింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి కోట్లు వచ్చి చేరాయి. ఒకటా రెండా ఏకంగా రూ. 48, 390 కోట్లు. భారత దేశ క్రీడా చరిత్రలో ఇది ఓ అరుదైన రికార్డు.
కేవలం డిజిటల్, మీడియా ప్రసార హక్కులకు(IPL Media Rights) సంబంధించి ఐదేళ్ల కాలానికి దక్కిన వాల్యూ ఇది. ప్రపంచ క్రీడా చరిత్రలో ఓ రికార్డ్ గా భావించవచ్చు. వరల్డ్ వైడ్ గా చూస్తే రిచ్ లీగ్ లలో ఇప్పుడు ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్ ) నాలుగోదిగా నిలిచింది.
భారత దేశం అంటే క్రికెట్. క్రికెట్ అంటే ఇండియా. 140 కోట్లకు పైగా ఉన్న యావత్ భారతమంతా జపించే పేరు క్రికెట్. అందుకే దానికంత డిమాండ్. ఐపీఎల్ మెగా వేలానికి ఊహించని రీతిలో పోటీ ఏర్పడింది.
చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో భారీ ధరకు రైట్స్ అమ్ముడు పోయాయి. డిస్నీ స్టార్ కు టెలివిజన్ హక్కులు దక్కించు కోగా డిజిటల్ హక్కుల్ని రిలయన్స్ వయా కామ్ వశమైంది. దిగ్గజ కార్పొరేట్ కంపెనీలు చివరి దాకా పోటీ పడ్డాయి.
రెండు రోజులు అనుకున్న ఐపీఎల్(IPL Media Rights) వేలం చివరకు మూడు రోజుల దాకా కొనసాగింది. ఆన్ లైన్ వేలం లో రికార్డు స్థాయిలో
బీసీసీఐకి కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది.
వచ్చే ఐదేళ్ల (2023-2027) కాలానికి బోర్డు వేలం చేపట్టింది. డిస్నీ స్టార్ , రిలయన్స్ వయా కామ్ 18 సంస్థలు రైట్స్ కోసం తీవ్రంగా పోటీ పడ్డాయి. కోట్లు కుమ్మరించాయి.
మొత్తం ఈ వేలం పాటను నాలుగు ప్యాకేజీలుగా విభజించారు. ఈ ఐదేళ్లలో ఒక్కో మ్యాచ్ కోసం రూ. 57.5 కోట్లు పలికింది. డిజటల్ హక్కుల కోసం వయా కామ్ 18 రూ. 20,500 కోట్లు ఖర్చు చేసింది.
ఉప ఖండంలో డిజిటల్ మీడియా ప్రసారాల కోసం వయాకామ్ ప్రయారిటీ ఇచ్చింది. ఇక ఎ, బి ప్యాకేజీలు డిస్నీ స్టార్, వయా కామ్ దక్కించుకోగా ఇక ప్యాకేజీ – సీ ( నాన్ ఎక్స్ క్యూజివ్ డిజిటల్ రైట్స్ ) హక్కుల్ని వయా కామ్ రూ. 2,991 కోట్లకు వశం చేసుకుంది.
ఇక ప్యాకేజీ – డి (ఉప ఖండం అవతల టీవీ, డిజిటల్ మీడియా ) రైట్స్ ను వయా కామ్ , టైమ్స్ ఇంటర్నెట్ సంయుక్తంగా రూ. 1324 కోట్లకు కైవసం చేసుకున్నాయి.
ఈ రెండు సంస్థలు ఒక్కో మ్యాచ్ కు రూ. 3 కోట్లు చెల్లించనున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్ గా నిలిచింది ఐపీఎల్ .
Also Read : స్పిన్ మంత్రం యుజ్వేంద్ర అద్భుతం