ICC Test Rankings : టెస్టు ర్యాంకింగ్స్ లో జో రూట్..కమిన్స్ టాప్
రెండు మూడు స్థానాల్లో లబూషేన్ , స్మిత్
ICC Test Rankings : ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టెస్టు ర్యాంకింగ్స్(ICC Test Rankings) డిక్లేర్ చేసింది. ఈ మేరకు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో ర్యాంకులను ప్రకటించింది.
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్ బ్యాటర్ల జాబితాలో టాప్ లో నిలిచాడు. స్వదేశంలో పర్యాటక న్యూజిలాండ్ తో జరిగిన సీరీస్ లో ఇప్పటి వరకు
జరిగిన రెండు టెస్టుల్లో జో రూట్ దుమ్ము రేపాడు.
ఫస్ట్ టెస్టులో 115 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇక రెండో టెస్టులో 176 పరుగులు చేసి కీలక పాత్ర పోషించాడు. ఫస్ట్ టెస్ట్ ను జో రూట్
గెలిపిస్తే రెండో టెస్టును బెయిర్ స్టో మారథాన్ ఇన్నింగ్స్ విజయం దక్కేలా చేశాడు.
అంతే కాకుండా టెస్టు క్రికెట్ హిస్టరీలో ఇంగ్లండ్ తరపున 10,000 వేల పరుగులు చేసిన రెండో క్రికెటర్ గా రికార్డ్ సృష్టించాడు జో రూట్. ఇక
ఆస్ట్రేలియాకు చెందిన స్టార్ ప్లేయర్ మార్నస్ లబూషేన్ ను నెట్టేశాడు.
అతడు రెండో స్థానంతో సరి పెట్టుకోగా మరో ఆసిస్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ మూడో స్థానంలో నిలిచాడు. ఇక భారత జట్టు ఆటగాళ్ల విషయానికి వస్తే బ్యాటర్లలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ 8వ స్థానంతో సరి పెట్టుకోగా మాజీ కెప్టెన్ కోహ్లీ 10వ స్థానంలో ఉన్నాడు.
ఇక బ్యాటింగ్ తో పరుగుల వరద పారిస్తున్న పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ నాలుగో ప్లేస్ లో నిలిచాడు. మరో వైపు బౌలర్ల విషయానికి వస్తే
ఆస్ట్రేలియా టెస్టు క్రికెట్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ టాప్ లో నిలిచాడు.
ఆ తర్వాతి స్థానంలో భారత బౌలర్లు జస్ ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ కొనసాగుతున్నారు. ఇక ఆల్ రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా,
అశ్విన్ తొలి రెండు స్థానాల్లో(ICC Test Rankings) నిలవడం విశేషం.
Also Read : నిలకడగా ఆడితే సంజూ శాంసన్ సూపర్