Rahul Tripathi : దేశానికి ఆడాలన్న కల నిజమైంది
ఐర్లాండ్ టి20కి రాహుల్ త్రిపాఠి
Rahul Tripathi : బీసీసీఐ ఐర్లాండ్ టూర్ లో ఆడే భారత క్రికెట్ జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా భువనేశ్వర్ వైస్ కెప్టెన్ గా ఎంపిక చేసింది. ఐపీఎల్ లో సత్తా చాటిన కేరళ స్టార్ ఆటగాడు సంజూ శాంసన్ , రాహుల్ త్రిపాఠి(Rahul Tripathi) కి చాన్స్ ఇచ్చింది.
ఈ సందర్భంగా రాహుల్ త్రిపాఠి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదృష్టం తలుపు తట్టడం వల్లే తాను టీజట్టు కు ఎంపికైనట్లు చెప్పాడు. ఇదిలా ఉండగా భారత జట్టు ఐర్లాండ్ టూర్ లో 2 మ్యాచ్ లు ఆడనుంది.
ఎంపిక కావడం అన్నది ఆటగాళ్ల చేతుల్లో ఉండదన్నాడు. అదంతా సెలెక్టర్ల చేతుల్లో ఉంటుందన్నారు. ఆయా పరిస్థితులకు అనుగుణంగా, ఆటగాళ్ల ప్రతిభ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుందని పేర్కొన్నాడు రాహుల్ త్రిపాఠి(Rahul Tripathi) .
ఈ అవకాశాన్ని తాను తప్పక సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తానని స్పష్టం చేశాడు. ఐపీఎల్ లో రాహుల్ త్రిపాఠి అద్భుతంగా ఆడాడు.
తాజాగా ఎంపిక చేసిన జట్టులో ఐపీఎల్ లో సత్తా చాటిన వారికే ప్రయారిటీ ఇచ్చారు బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ. ఇదిలా ఉండగా రాహుల్ త్రిపాఠి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలన్న కల నిజమైంది. ప్రతి క్రికెటర్ తను ఆడటం మొదలు పెట్టిన ప్రతిసారి దేశానికి ఆడాలని అనుకుంటాడని అన్నాడు త్రిపాఠి.
నేను నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం కన్న గొప్ప సక్సెస్ ఏముంటుందన్నాడు.
Also Read : ఎట్టకేలకు సంజూ శాంసన్ కు చాన్స్