Jos Butler Record : జోస్ బ‌ట్ల‌ర్ సునామీ ఇన్నింగ్స్

70 బంతులు 162 ర‌న్స్ తో రికార్డ్ బ్రేక్

Jos Butler Record : ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ జ‌ట్టు త‌ర‌పున ప్రాతినిధ్యం వ‌హించిన జోస్ బ‌ట్ల‌ర్(Jos Butler Record ) అదే జోరు కంటిన్యూ చేశాడు. నెదర్లాండ్స్ తో జ‌రిగిన మొద‌టి వ‌న్డే మ్యాచ్ లో ఇంగ్లండ్ వ‌న్డే హిస్ట‌రీలో అరుదైన రికార్డు న‌మోదు చేసింది.

కేవ‌లం 4 వికెట్లు కోల్పోయి 489 ప‌రుగులు చేసింది. గ‌తంలో ఇంగ్లాండ్ జ‌ట్టు ఆస్ట్రేలియాపై న‌మోదు చేసిన 481 ప‌రుగుల రికార్డును దాటేసింది స‌రికొత్త చ‌రిత్ర సృష్టించింది.

ప‌సి కూన‌ల‌పై పేట్రేగి పోయారు ఇంగ్లాండ్ బౌల‌ర్లు. సాల్ట్, మిలాన్ ఇద్ద‌రూ క‌లిసి రెండో వికెట్ కు 222 భాగ‌స్వామ్యాన్ని న‌మోదు చేశారు. ఇది కూడా రికార్డే. ఈ మ్యాచ్ లో ఫోర్లు, సిక్స‌ర్లు అల‌వోక‌గా వ‌చ్చాయి.

ఒక ర‌కంగా చెప్పాలంటే ప‌రుగుల వ‌ర‌ద పారింది. బంతులు రావ‌డ‌మే ఆల‌స్యం. ఫోర్లు, సిక్స‌ర్ల‌తో మైదానం ద‌ద్ద‌రిల్లి పోయింది. ఇక జోస్ బ‌ట్ల‌ర్ వ‌చ్చీ రావ‌డంతోనే నెద‌ర్లాండ్స్ బౌల‌ర్ల‌పై విరుచుకు ప‌డ్డాడు.

ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. దంచి కొట్టాడు. బ‌ట్ల‌ర్ త‌న కెరీర్ లో మూడో ఫాస్టెస్ట్ సెంచ‌రీ సాధించాడు. 47 బంతుల్లోనే సెంచ‌రీ న‌మోదు చేశాడు. అనంత‌రం 70 బంతుల్లో 162 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

అంత‌కు ముందు జోస్ బ‌ట్ల‌ర్ 2015లో పాకిస్తాన్ జ‌ట్టుపై సెంచ‌రీ సాధించాడు. ఇదే జ‌ట్టుపై 2019లో మ‌రో వేగ‌వంత‌మైన శ‌తకాన్ని సాధించాడు. ఈ సెంచ‌రీని 50 బంతుల్లో కొట్టాడు.

ఇంగ్లండ్ త‌ర‌పున మూడు ఫాస్టెస్ట్ సెంచ‌రీలు సాధించిన ఏకైక బ్యాట‌ర్ గా మ‌రో చరిత్ర సృష్టించాడు జోస్ బ‌ట్ల‌ర్(Jos Butler Record) . ఇక తాజాగా బ‌ట్ల‌ర్ సాధించిన ప‌రుగుల్లో 7 ఫోర్లు 14 సిక్స‌ర్లు ఉన్నాయి.

Also Read : స‌త్తా చాటిన భార‌త్ సీరీస్ సమం

Leave A Reply

Your Email Id will not be published!