TS Govt Jobs : 10,105 జాబ్స్ భ‌ర్తీకి ఆర్థిక శాఖ లైన్ క్లియ‌ర్

నోటిఫికేష‌న్లు ఇవ్వాల‌ని ఆదేశించిన స‌ర్కార్

TS Govt Jobs : ఎంతో కాలంగా ఎదురు చూస్తూ వ‌స్తున్న నిరుద్యోగుల‌కు తెలంగాణ స‌ర్కార్ మ‌రో తీపి క‌బురు చెప్పింది. ఇప్ప‌టికే పోస్టుల భ‌ర్తీకి

ప‌చ్చ జెండా ఊపినా, ఆర్థిక శాఖ క్లియ‌రెన్స్ ఇచ్చినా ఇప్ప‌టి వ‌ర‌కు నోటిఫికేష‌న్లు జారీ కాలేదు.

కొన్నింటికి మాత్ర‌మే వ‌చ్చాయి. దీంతో నిరుద్యోగులు ఇదంతా ఎన్నిక‌ల స్టంట్ త‌ప్ప మ‌రొక‌టి కాద‌ని ఆరోపిస్తున్నారు. భ‌ర్తీ చేసేంత దాకా న‌మ్మ‌కం

లేద‌ని పేర్కొంటున్నారు.

తాజాగా మ‌రో 10, 105 పోస్టుల(TS Govt Jobs) భ‌ర్తీకి ప‌ర్మిష‌న్ ఇచ్చింది ఆర్థిక శాఖ‌. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేసింది. ప్ర‌స్తుతం ప్ర‌క‌టించిన జాబ్స్ ల‌లో ఎక్కువ‌గా గురుకులాల్లోనే ఉండ‌డం విశేషం.

ఇందులో 9,096 జాబ్స్(TS Govt Jobs) ఉన్నాయి. మిగిలిన 995 పోస్టుల‌ను తెలంగాణ రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ద్వారా భ‌ర్తీ చేయ‌నున్నారు. మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌లో జిల్లా ఎంపిక క‌మిటీ ద్వారా 14 జాబ్స్ భ‌ర్తీ చేస్తారు.

ఇప్ప‌టి వ‌ర‌కు 45,325 పోస్టుల‌కు అనుమ‌తి ల‌భించిన‌ట్ల‌యింది. మ‌హిళా సంక్షేమ శాఖ‌లో 251, దివ్యాంగులు, వృద్దుల సంక్షేమంలో 71,

జువైన‌ల్ వెల్ఫేర్ లో 66 పోస్టులు ఉన్నాయి.

బీసీ సంక్షేమంలో 157 పోస్టులు, ట్రైకార్ లో 1, గిరిజ‌న స‌హ‌కార ఆర్థిక సంస్థ‌లో 15, చీఫ్ ఇంజ‌నీర్ ట్రైబ‌ల్ వెల్ఫేర్ లో 24 , ట్రైబ‌ల్ క‌ల్చ‌ర్,

ట్రైనింగ్ సంస్థ‌లో 16 జాబ్స్ ఉన్నాయి.

ఇక గిరిజ‌న సంక్షేమ శాఖ‌లో 78, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ‌లో 316, మైనార్టీ గురుకులాల విద్యాల‌యాల సొసైటీలో 1,445, మ‌హాత్మా జ్యోతిబా

పూలే గురుకులాల విద్యాల‌యాల సొసైటీలో 3,870 జాబ్స్ ఉన్నాయి.

సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాల‌యాల సొసైటీలో 1,514 కొలువులు ఖాళీ ఉండ‌గా జిల్లా సెలెక్ష‌న్ క‌మిటీ ద్వారా 14 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇందుకు సంబంధించి నోటిఫికేష‌న్లు జారీ చేయాల‌ని ఆదేశించింది స‌ర్కార్.

Also Read : ఓయూ సంచ‌ల‌న నిర్ణ‌యం

Leave A Reply

Your Email Id will not be published!