Modi Mother : త‌ల్లీ క‌ల‌కాలం వ‌ర్దిల్లు న‌న్ను దీవించు – మోదీ

త‌ల్లి హీరా బెన్ పాదాలు క‌డిగిన మోదీ

Modi Mother : ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ త‌న త‌ల్లి(Modi Mother) ని ద‌ర్శించుకున్నారు. ఆయ‌న గుజ‌రాత్ లోని గాంధీ న‌గ‌ర్ లో ఉంటున్న త‌ల్లి హీరా బెన్ ను సంద‌ర్శించారు. జూన్ 18 శ‌నివారం హీరా బెన్ పుట్టిన రోజు.

ఇవాల్టితో ఆమెకు 99 ఏళ్లు పూర్త‌యి 100వ సంవ‌త్స‌రంలోకి అడుగు పెట్టింది. ఈ సంద‌ర్భంగా న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ త‌న త‌ల్లి(Modi Mother) పాదాల‌ను క‌డిగారు. ఆ నీళ్ల‌ను త‌న నెత్తిపై పోసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా క‌ల‌కాలం ఇలాగే వ‌ర్దిల్ల‌వంటూ కోరారు. త‌న‌ను ఆశీర్వ‌దించు అంటూ విన్న‌వించుకున్నారు. న‌రేంద్ర మోదీ ఈ పేరు ప్ర‌పంచ వ్యాప్తంగా సుప‌రిచితమే.

క‌ష్ట‌ప‌డి దేశంలో అత్యున్న‌తమైన ప్ర‌ధాన మంత్రి ప‌ద‌విని అధీష్టించారు. ఇవాళ వ‌ర‌ల్డ్ లోనే అత్యంత శ‌క్తివంత‌మైన నాయ‌కుల‌లో ఒక‌రుగా ఉన్నారు.

ప్ర‌తి ఏటా త‌న త‌ల్లి హారా బెన్ పుట్టిన రోజు త‌న ఇంట్లోనే నిర్వ‌హిస్తారు మోదీ. అనంత‌రం త‌న త‌ల్లికి భావోద్వేగంతో లేఖ‌లు రాస్తూ వుంటారు.

ఇన్నేళ్ల‌యినా ఇప్ప‌టికీ ప్ర‌ధాన మంత్రి యోగా చేస్తారు. భ‌క్తిని అనుస‌రిస్తారు. పుస్త‌కాలు చ‌దువుతారు. సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఇది ఆయ‌న ప్ర‌త్యేక‌త‌.

భార‌త దేశాన్ని డిజిట‌ల్ టెక్నాల‌జీతో అనుసంధానం చేసిన ఘ‌న‌త మోదీకే ద‌క్కుతుంది. కాగా మోదీ త‌ల్లి హారీ బెన్(Modi Mother) జూన్ 18, 1923లో పుట్టారు. త‌న త‌ల్లి వందో ఏట ప్ర‌వేశించినందుకు ప్ర‌ధాని భావోద్వేగంతో లేఖ రాశారు.

ఇదే స‌మ‌యంలో మా తండ్రి జీవించి ఉంటే సంతోషించే వాడు. మోదీ కుటుంబం అహ్మ‌దాబాద్ లోని జ‌గ‌న్నాథ ఆల‌యంలో అన్నదానం చేప‌ట్టింది.

Also Read : ప్లీజ్ సంయ‌నం పాటించండి – వ‌రుణ్ గాంధీ

 

Leave A Reply

Your Email Id will not be published!