Naveen Patnaik Pope : పోప్ ను క‌ల‌వనున్న న‌వీన్ ప‌ట్నాయ‌క్

11 రోజుల పాటు విదేశాల‌లో సీఎం టూర్

Naveen Patnaik Pope :  ఈ దేశంలో ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుండా ప‌ని చేసుకుంటూ పోయే ముఖ్య‌మంత్రుల‌లో ఒడిశా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్(Naveen Patnaik Pope) ముందు వ‌రుస‌లో ఉంటారు.

ఆయ‌న 11 రోజుల పాటు విదేశాల‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ మేర‌కు బ‌య‌లు దేరారు. ఇందులో భాగంగా వాటిక‌న్ సిటీ పోప్(Naveen Patnaik Pope) ను క‌లుసుకుంటారు సీఎం.

దీంతో పాటు దుబాయిలో పెట్టుబ‌డిదారుల‌ను క‌లుసుకుంటారు. ఈ విష‌యాన్ని ఒడిశా ముఖ్య‌మంత్రి కార్యాల‌యం వెల్ల‌డించింది.

కాగా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ త‌న 22 ఏళ్ల సుదీర్ఘ పాల‌న‌లో రెండో అధికారిక విదేశీ ప‌ర్య‌ట‌న ఇది. రోమ్ లో ఉంటారు. అక్క‌డ పోప్ ఫ్రాన్సిస్ ను క‌లుసుకుంటారు.

వ‌ర‌ల్డ్ ఫుడ్ ప్రోగ్రాం (డ‌బ్ల్యుఎఫ్‌పి) లో పాల్గొనేందుకు సీఎంకు ఆహ్వానం అందింది. ఇది రోమ్ లో జ‌రుగుతుంది. ఇందులో పాల్గొనే ప్ర‌తినిధి బృందానికి న‌వీన్ ప‌ట్నాయ‌క్ నాయ‌క‌త్వం వ‌హిస్తారు.

ఆహార భ‌ద్ర‌త‌, విప‌త్తు నిర్వ‌హ‌ణ రంగంలో ఒడిశా ఎలాంటి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింది, ఎలా అధిగ‌మించింద‌నే దానిపై ప్ర‌సంగిస్తారు సీఎం. ఇదే స‌మ‌యంలో డ‌బ్ల్యుఎఫ్ పి డైరెక్ట‌ర్ డేవిడ్ బీస్లీ ,సంస్థ ఇత‌ర సీనియ‌ర్ ఆఫీస్ బేర‌ర్ల‌ను కూడా క‌లుస్తారు.

అంతే కాకుండా ఆహార భ‌ద్ర‌త‌ను స్థిర‌మైన రీతిలో నిర్ధారించేందుకు భ‌విష్య‌త్తు ప్రాజెక్టుల మ‌ధ్య వివ‌ర‌ణాత్మ‌క చ‌ర్య‌లు జ‌రుపుతార‌ని సీఎంఓ వెల్ల‌డించింది.

ఇదే స‌మ‌యంలో ఐరోపా లోని వివిధ ప్రాంతాల నుండి ఒడియా ప్ర‌వాసుల‌ను క‌లుసుకుంటారు. ఇట‌లీ టూర్ అనంత‌రం న‌వీన్ ప‌ట్నాయ‌క్ బృందం యూఏఈలోని దుబాయ్ లో ప‌శ్చిమాసియా కు చెందిన పెట్టుబ‌డిదారుల‌తో స‌మావేశం కానున్నారు.

ఈనెల 30న టూర్ ముగించుకున్ని భార‌త్ కు వ‌స్తార‌ని సిఎంఓ వెల్ల‌డించింది.

Also Read : అహింసా మార్గంలో నిర‌స‌న తెల‌పండి

Leave A Reply

Your Email Id will not be published!