Nadeem Iqbal : లైంగిక వేధింపులపై పాక్ క్రికెట్ కోచ్ అరెస్ట్
నదీమ్ ఇక్బాల్ సస్పెండ్..పీసీబీ యాక్షన్
Nadeem Iqbal : లైంగిక వేధింపులు ప్రతి చోటా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రత్యేకంగా క్రీడా రంగంలో ఇవి సర్వ సాధరణమై పోయాయి. ఈ తరుణంలో పాకిస్తాన్ క్రికెట్ లో పీసీబీ తీసుకున్న చర్య కలకలం రేపింది.
ఆ దేశానికి చెందిన మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ , జాతీయ స్థాయి కోచ్ నదీమ్ ఇక్బాల్(Nadeem Iqbal) పై లైంగికంగా వేధింపులకు గురి చేశాడంటూ తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి.
ఈ విషయాన్ని ముల్తాన్ కు చెందిన మహిళా క్రికెటర్ ఒకరు ఆరోపించారు. తనకు జట్టులో ఆడే చాన్స్ ఇస్తానంటూ హామీ ఇచ్చాడని, ఇదే సమయంలో వేధింపులకు పాల్పడినట్లు ఆరోపించింది.
ఇదే విషయాన్ని బాధిత మహిళా క్రికెటర్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు ఫిర్యాదు చేసింది. పరిస్థితి తీవ్రతను గమనించిన పీసీబీ చైర్మన్ రమీజ్ రజా రంగంలోకి దిగారు.
విచారణకు ఆదేశించారు. నదీమ్ ఇక్బాల్(Nadeem Iqbal) ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అతడిని పోలీసులకు అప్పగించినట్లు పీసీబీ వెల్లడించింది.
ఎవరు ఇబ్బంది కలిగించినా ఊరుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. బాధిత మహిళా క్రికెటర్ చేసిన ఆరోపణలు ఒక్కసారిగా పీసీబీని కుదిపేశాయి.
కొన్నేళ్ల కిందట పీసీబీ ఉమెన్స్ ట్రయల్స్ కు వచ్చా. నదీమ్ ఇక్బాల్ పరిచయం పెంచుకుని వేధింపులకు గురి చేశాడు. ఈ సందర్భంగా జట్టులో ప్లేస్ దక్కేలా చేస్తానన్నాడు. ఆపై లైంగికంగా వేధించాడు.
ఫ్రెండ్స్ ను కూడా తీసుకు వచ్చాడు. వీడియోలు తీశాడు. బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడ్డాడని వాపోయింది. చివరకు విషయాన్ని బయట పెట్టాల్సి వచ్చిందని కన్నీటి పర్యంతమైంది.
Also Read : టెస్ట్ క్రికెట్ కు కేథరిన్ బ్రంట్ గుడ్ బై