Indian Womens Team : లంకకు చేరుకున్న మహిళా క్రికెట్ జట్టు
వన్డే సీరీస్ ఆడనున్న భారత క్రికెట్ టీమ్
Indian Womens Team : పరిమిత ఓవర్ల సీరీస్ కోసం భారత మహిళల క్రికెట్ జట్టు(Indian Womens Team) శ్రీలంకకు చేరుకుంది. పంజాబ్ రాష్ట్రానికి చెందిన హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు ఆదివారం లంకలో కొలువుతీరింది.
ఇంతకు ముందు భారత మహిళా జట్టు కెప్టెన్ గా ఉన్న హైదరాబాదీ స్టార్ ప్లేయర్ మిథాలీ రాజ్ క్రికెట్ కు గుడ్ బై చెప్పింది. దీంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెలెక్షన్ కమిటీ ఆమె స్థానంలో హర్మన్ ప్రీత్ కౌర్ కు సారథ్య బాధ్యతలు అప్పగించింది.
ఇదిలా ఉండగా వెటరన్ మహిళా క్రికెటర్ ఝులన్ గోస్వామి , తదితర సీనియర్ ప్లేయర్లు లేకుండానే యువ మహిళ భారత జట్టు శ్రీలంకకు చేరింది.
శ్రీలంక టూర్ లో భాగంగా విమెన్ టీమిండియా వరుసగా పల్లెకెలె, దంబుల్లాలో మూడు వన్డే మ్యాచ్ లతో పాటు టి20 సీరీస్ కూడా ఆడనుంది.
శ్రీలంకకు చేరుకున్న భారత జట్టుకు అక్కడ అపూర్వమైన స్వాగతం లభించింది. ఇక జట్టు లంకకు వెళ్లే కంటే ముందు బెంగళూరు లోని నేషనల్ క్రికెట్ అకాడమీలో క్యాంపు నిర్వహించింది.
ఎన్సీఏ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ తో మహిళా క్రీడాకారిణు(Indian Womens Team) లు సంభాషించారు. పర్యటన సందర్భంగా భారత మహిళా జట్టుకు కొత్తగా పగ్గాలు తీసుకున్న హర్మన్ ప్రీత్ కౌర్ మీడియాతో మాట్లాడారు.
అన్ని రంగాలలో అనుభవం కలిగిన ప్లేయర్లు జట్టులో ఉన్నారని తెలిపారు. కాగా మిథాలీ రాజ్, ఝులన్ గోస్వామి లాంటి సీనియర్లు లేక పోవడం ఒకింత బాధ కలిగిస్తోందని చెప్పారు.
అయినా ప్రత్యర్థి జట్టుతో పోరాడేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు హర్మన్ ప్రీత్ కౌర్.
Also Read : లైంగిక వేధింపులపై పాక్ క్రికెట్ కోచ్ అరెస్ట్
The Indian team arrives in Sri Lanka 🇱🇰
📸: @DanuskaAravinda pic.twitter.com/epeIHBNZaM
— Women’s CricZone (@WomensCricZone) June 19, 2022