IND vs SA 5th T20 : కుండపోత వర్షం టి20 సీరీస్ సమం
2-2 మ్యాచ్ లతో భారత్, సఫారీ సమానం
IND vs SA 5th T20 : నువ్వా నేనా అన్న రీతిలో కొనసాగుతుందని భావించిన క్రికెట్ లవర్స్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది వర్షం. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా సీరీస్ ను నిర్ణయించే కీలకమైన ఐదో టి20 మ్యాచ్(IND vs SA 5th T20) ఆట పూర్తి కాకుండానే ముగిసింది.
ఢిల్లీ, కటక్ మ్యాచ్ లలో పర్యాటక జట్టు సౌతాఫ్రికా విజయం సాధించింది. మూడో, నాలుగో టి20 మ్యాచ్ లలో భారత్ సత్తా చాటింది. ప్రత్యర్థి జట్టును మట్టి కరిపించింది.
దీంతో ఆఖరి మ్యాచ్ పై ఉత్కంఠను రేపింది. ఆదివారం ఆట ప్రారంభమైన కొద్ది సేపటికే వర్షం కంటిన్యూగా కురిసింది.
దీంతో భారత(IND vs SA 5th T20) జట్టు కేవలం 3.3 ఓవర్లు మాత్రమే ఆడింది. ఆ తర్వాత ఎంతకూ వర్షం ఆగలేదు. పరిస్థితిని అంచనా వేసిన
ఐసీసీ రిఫరీ జవగల్ శ్రీనాథ్ ఐదో టి20 మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
దీంతో ఐదు మ్యాచ్ ల సీరీస్ ను 2-2 మ్యాచ్ ల గెలుపుతో చెరి సమానంగా నిలిచాయి. ఇదిలా ఉండగా మ్యాచ్ కు సంబంధించి మొదట టీమిండియా మైదానంలోకి దిగింది.
ఆదిలోనే దెబ్బ పడింది. సౌతాఫ్రికా బౌలర్ ఎంగిడి దెబ్బకు బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. ఫామ్ మీద ఉన్న ఇషాన్ కిషన్ ను అద్భుతమైన బంతికి బోల్తా కొట్టించాడు. రెండో ఓవర్ లో చిక్కాడు.
ఇక నాలుగో ఓవర్ లో స్టార్ హిట్టర్ గా పేరొందిన రుతు రాజ్ గైక్వాడ్ ను పెవిలియన్ కు పంపించాడు. 3.3 ఓవర్ల దగ్గర ఆటను నిలిపి వేస్తున్నట్లు అంపైర్లు డిక్లేర్ చేశారు ఐసీసీ రిఫరీ ఆదేశం మేరకు.
ఇక ఆట ముగిసే సమయానికి శ్రేయస్ అయ్యర్, కెప్టెన్ పంత్ క్రీజులో ఉన్నారు.
Also Read : ప్రజల ఆకలి తీరుస్తున్న రోషన్ మహనామా