EPS vs OPS : ఆధిపత్య పోరాటం ముదిరిన ముసలం
పన్నీర్ సెల్వం వర్సెస్ పళని స్వామి
EPS vs OPS : అన్నాడీఎంకేలో బహిష్కృత నాయకురాలు వీకే శశికళ వచ్చాక వర్గ విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి. గతంలో సీఎంగా పని చేసిన ఎడాపొడి పళని స్వామి , డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం(EPS vs OPS) మధ్య ఆధిపత్య పోరు మొదలైంది.
నువ్వా నేనా అన్న రీతిలో కొనసాగుతోంది. ఈ తరుణంలో పార్టీ పగ్గాల కోసం ఇరువురు పోటీ పడుతున్నారు. ఎవరు ఉండాలనే దానిపై ఇంకా పోరాటం కొనసాగుతూనే ఉంది.
ఇటీవల జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో, పురపాలిక ఎన్నికల్లో అన్నాడీఎంకే ఆశించినంత మేర రాణించ లేక పోయింది. మరో వైపు మిత్రపక్షంగా ఉన్న భారతీయ జనతా పార్టీ ఊహించని రీతిలో పుంజుచుకుంది.
మొత్తం తమిళనాడు హిస్టరీ చూస్తే అయితే డీఎంకే లేదంటే అన్నాడీఎంకే మాత్రమే ఉండాలి. కానీ సీన్ మారింది. ఎప్పుడైతే అన్నామలై బీజేపీ చీఫ్ గా ఎంపికయ్యాడో ఆ పార్టీని బలోపేతం చేయడంలో మునిగి పోయాడు.
ఈ తరుణంలో అన్నాడీఎంకే ఇప్పుడు మూడు ముక్కలాటగా మారింది. దివంగత సీఎం జయలలిత చని పోయాక అన్నీ తానై వ్యవహరించిన
వీకే శశికళ నాలుగేళ్ల పాటు జైలుకు వెళ్లి వచ్చింది.
ఆ తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించింది. మళ్లీ తాను వస్తున్నానంటూ డిక్లేర్ చేసింది. ఇదే సమయంలో ఆమె పట్ల పన్నీర్
సెల్వం సానుకూలంగా ఉండగా పళని స్వామి మాత్రం ఆమె అడుగు పెట్టేందుకు వీలు లేదంటూ ప్రకటించాడు.
ఇదే క్రమంలో పన్నర్, పళని లలో ఎవరో ఒకరు పార్టీ పగ్గాలు చేపట్టాలంటూ ఇరు వర్గాల మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. ఈనెల
14న జిల్లా కార్యదర్శుల మీటింగ్ లో గందరగోళానికి దారి తీసింది.
ఇది తీవ్రమై జయలలిత సమాధి వద్ద ఉద్రిక్తత పెంచేలా చేసింది. ఓ కార్యకర్త పళని ఉండేందుకు వీలు లేదంటూ ఆత్మహత్యాయత్నానికి
పాల్పడటం కలకలం రేగింది.
ఎవరో ఒకరు పార్టీకి చీఫ్ గా ఉండాలంటున్నాడు పళని స్వామి. అలా వీలు కుదరదంటున్నాడు పన్నీర్ సెల్వం. చివరకు కోర్టును కూడా
ఆశ్రయించారు. కోర్టు తాము జోక్యం చేసుకోలేమంటూ స్పష్టం చేసింది.
ఈనెల 23న గురువారం కీలక సమావేశం జరగనుంది. ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది అన్నాడీఎంకే శ్రేణుల్లో.
Also Read : నా వెనుక 46 మంది ఎమ్మెల్యేలు – షిండే