Zaheer Abbas : ఐసీయూలో చేరిన జహీర్ అబ్బాస్
లండన్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిక
Zaheer Abbas : పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం జహీర్ అబ్బాస్ అనారోగ్యం కారణంగా లండన్ లోని ఐసీయూలో చేరాడు. ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
జియో సంస్థ తెలిపిన వివరాల ప్రకారం 74 ఏళ్ల వయస్సు కలిగిన జహీర్ అబ్బాస్(Zaheer Abbas) లండన్ లోని పాడింగ్టన్ లోని సెయింట్ మేరీస్ హాస్పిటల్ లో చేరాడు. మూడు రోజుల తర్వాత పరిస్థితి విషమించడంతో ఐసీయూకు తరలించారు.
జహీర్ అబ్బాస్ ఆక్సిజన్ అందక ఇబ్బంది పడుతున్నట్టు తెలిపింది. జహీర్ అబ్బాస్ దుబాయ్ నుండి లండన్ కు ప్రయాణం చేస్తున్న సమయంలో కరోనా బారిన పడ్డారు. తనకు నొప్పి వస్తోందంటూ ఫిర్యాదు చేశాడు.
బ్రిటీష్ రాజధాని లండన్ కు చేరుకున్నాక ఆయన న్యూమోనియాతో బాధ పడుతున్నాడు. జహీర్ అబ్బాస్ కు డయాలసిస్ అందజేస్తున్నామని, ఎవరూ కలవ కూడదని వైద్యులు సూచించినట్లు తెలిపింది జియో న్యూస్ .
ఇదిలా ఉండగా ప్రపంచ క్రికెట్ చరిత్రలో జహీర్ అబ్బాస్ కు ఎనలేని పేరుంది. 1969లో న్యూజిలాండ్ పై అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తన తరంలోని అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడు. 72 టెస్టుల్లో 5,062 పరుగులు చేశాడు.
62 వన్డే మ్యాచ్ లలో 2,572 రన్స్ చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో జహీర్ అబ్బాస్ 459 మ్యాచ్ లలో 34,843 పరుగులు చేశాడు. ఇందులో 108 సెంచరీలు, 158 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
రిటైర్ అయ్యాక ఒక టెస్టు, మూడు వన్డేలలో ఐసీసీ మ్యాచ్ రిఫరీగా పని చేశాడు. 2020లో జాక్వెస్ కల్లిస్ , లిసా స్తాలేకర్ తో కలిసి ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో కూడా ఉన్నాడు అబ్బాస్.
Also Read : సర్ఫరాజ్ ఖాన్ సెంచరీ..కంటతడి