Air India Offer : రిటైర్డ్ పైల‌ట్ల‌కు ఎయిర్ ఇండియా ఆఫ‌ర్

ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత కూడా ప‌ని చేసే చాన్స్

Air India Offer : టాటా గ్రూప్ ఎయిర్ ఇండియాను టేకోవ‌ర్ చేశాక కీల‌క మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్ప‌టికే మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు ప్ర‌యారిటీ ఇస్తోంది. తాజాగా ఎయిర్ ఇండియాను లాభాల బాట ప‌ట్టించేందుకు ఫోక‌స్ పెట్టింది.

ఇందులో భాగంగా కొత్త‌గా 300 విమానాల‌ను కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకుంది. ఈ త‌రుణంలో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. గ‌తంలో పైలట్లుగా ప‌ని చేసి ప‌దవీ విర‌మ‌ణ పొందిన వారికి ప‌ని చేసేందుకు ఛాన్స్ ఇవ్వాల‌ని డిసైడ్ అయ్యింది.

వీరికి సంబంధించి ఐదేళ్ల కాలానికి రిటైర్మెంట్ త‌ర్వాత పైల‌ట్ల‌ను తిరిగి నియ‌మించు కునేందుకు బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. ప‌ని చేసేందుకు గాను ఎయిర్ ఇండియా రైట‌ర్డ్ పైలెట్ల స‌మ్మ‌తిని కోరిన‌ట్లు సీనియ‌ర్ అధికారి ఒక‌రు వెల్ల‌డించారు.

ఈ పైల‌ట్ ల‌ను మ‌ళ్లీ క‌మాండ‌ర్ లుగా నియ‌మించు కోవాల‌ని ప‌రిశీలిస్తోంద‌న్నారు. ఇదిలా ఉండ‌గా మూడు సంవ‌త్స‌రాల కింద‌ట ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన పైల‌ట్ల‌కు స‌మాచారం పంపించిన‌ట్లు స్ప‌ష్టం చేశారు.

ఇదిలా ఉండ‌గా టాటా ఎయిర్ ఇండియాను (Air India Offer) తీసుకున్న వెంట‌నే సంస్థ‌లో ప‌ని చేసే సిబ్బందికి మ‌రో ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. అదేంటంటే స్వ‌చ్చంధ ప‌ద‌వీ విర‌మ‌ణ కు అవ‌కాశం ఇస్తున్న‌ట్లు తెలిపింది.

ఇక విమాన‌యానాల వ‌ర‌కు వ‌స్తే క్యాబిన్ క్రూ, ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజ‌నీర్ల కంటే విమానాల‌ను న‌డిపే పైలెట్ల‌కే ప్ర‌యారిటీ ఎక్కువ‌గా ఉంటుంది.

ఎందుకంటే వాటిని న‌డిపే వారు వీరే కాబ‌ట్టి. అందుకంత డిమాండ్ వీరికి. వీరికి పెద్ద ఎత్తున వేత‌నాలు ద‌క్క‌నున్నాయి.

Also Read : ముడుపులిచ్చారు కోట్లు కొల్ల‌గొట్టారు

Leave A Reply

Your Email Id will not be published!