Sanjay Manjrekar : ఇంగ్లండ్ తో రసవత్తర పోటీ ఖాయం
మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్
Sanjay Manjrekar : రోహిత్ శర్మ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్ టూర్ లో ఉంది. ఇందులో భాగంగా కరోనా కారణంగా మిగిలి పోయిన 5వ రీ షెడ్యూల్ మ్యాచ్ తో పాటు వన్డేలు, టి20లు ఆడనుంది.
భారత్ నాలుగు రోజుల మ్యాచ్ లీసెస్టైర్ తో ఆడుతోంది. ఇదిలా ఉండగా ఇంగ్లండ్ స్వదేశంలో పులిలా విజృంభిస్తోంది. బలమైన న్యూజిలాండ్ ను మట్టి కరిపించింది.
ప్రస్తుతం 2-1 తేడాతో భారత్ ఆధిక్యంలో ఉన్నప్పటికీ ప్రస్తుతం ఇంగ్లండ్ జోరు చూస్తే తట్టుకోవడం ఇబ్బందికరంగానే ఉంది. ఈ తరుణంలో భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు, స్టార్ స్పోర్స్ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్(Sanjay Manjrekar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వాళ్లకు బెన్ స్టోక్స్ ఉంటే భారత్ కు రిషబ్ పంత్ ఉన్నాడని పేర్కొన్నాడు. జూలై 1 నుంచి 5 వరకు టెస్ట్ మ్యాచ్ కు సిద్దం కానుంది టీమిండియా. భారత జట్టు 1971, 1986, 2007లో మూడు టెస్టు సీరీస్ లను గెలుచుకుంది.
ఈసారి మరోసారి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసేందుకు రెడీ అవుతోంది రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, పంత్ , పుజారా బ్యాటర్ల బలం ఉంది. మరో వైపు షమీ, బుమ్రా రాణించడం ఖాయమన్నాడు.
భిన్నమైన పరిస్థితులలో వీరంతా రాణించే సత్తా కలిగిన ఆటగాళ్లని అంచనా వేశాడు సంజయ్ మంజ్రేకర్. 37 టెస్టులు , 74 వన్డేలు ఆడిన అనుభవం ఉన్న పంత్ రెడ్ బాల్ క్రికెట్ లో సత్తా చాటే చాన్స్ ఉందన్నాడు.
Also Read : రమీజ్ రజా షాకింగ్ కామెంట్స్