INDW vs SLW 2nd T20 : రెండో టి20లో భారత్ గ్రాండ్ విక్టరీ
చేతులెత్తేసిన శ్రీలంక మహిళా జట్టు
INDW vs SLW 2nd T20 : పంజాబ్ కు చెందిన హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత మహిళా జట్టు అద్భుతమైన ఆట తీరును ప్రదర్శిస్తోంది. శ్రీలంక టూర్ లో భాగంగా మొదటి టి20 మ్యాచ్ లో 34 పరుగుల తేడాతో ఓడించింది.
ఇక రెండో టి20 మ్యాచ్ లో సైతం అదే జోరు కొనసాగించింది. శనివారం జరిగిన కీలక మ్యాచ్ లో భారత్ అన్ని రంగాలలో రాణించింది. ఆతిథ్య
జట్టును 20 ఓవర్లలో మొదట 7 వికెట్లు పడగొట్టి 125 పరుగులకే కట్టడి చేసింది.
అనంతరం 126 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి ఇంకా 5 బంతులు మిగిలి ఉండగానే 19.1 ఓవర్ల లోనే లక్ష్యాన్ని ఛేదించింది. లంక లోని దంబుల్లాలో జరిగింది ఈ రెండో టి20 మ్యాచ్.
జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ లోను రాణించింది. ఇక వైస్ కెప్టెన్ స్మృతి మంధాన సత్తా చాటింది. 34 బంతులు ఎదుర్కొని 39 పరుగులు చేసింది.
షెఫాలీ వర్మ 10 బంతులు ఆడి 17 పరుగులు చేస్తే , సబ్బినేని మేఘన 10 బాల్స్ ఎదుర్కొని 17 రన్స్ చేసింది. భారత జట్టు(INDW vs SLW 2nd T20) విజయంలో కీలక పాత్ర పోషించారు.
ఇక జట్టు పగ్గాల్ని హైదరాబాదీ స్టార్ హిట్టర్ మిథాలీ రాజ్ తప్పు కోవడంతో హర్మన్ ప్రీత్ తీసుకుంది. కౌర్ 32 బంతులు ఎదుర్కొని అజేయంగా 31 పరుగులు చేసి చివరి దాకా గెలుపు సాధించేలా చేసింది.
ఇక చివరిదైన మూడో టి20 మ్యాచ్ సోమవారం జరగనుంది. ఇదిలా ఉండగా స్మృతి మంధాన అరుదైన రికార్డును స్వంతం చేసుకుంది. టి20
ఫార్మాట్ లో అత్యంత వేగంగా 2,000 పరుగులు చేసిన రెండో భారత మహిళా క్రికెటర్ గా స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది.
Also Read : ఇంగ్లండ్ తో రసవత్తర పోటీ ఖాయం