ENG vs NZ 3rd Test : రాణించిన లాథమ్..విలియమ్సన్
రసపట్టులో మూడో టెస్టు మ్యాచ్
ENG vs NZ 3rd Test : ఇంగ్లండ్ లోని లీడ్స్ వేదికగా జరుగుతున్న మూడో కీలక టెస్టులో(ENG vs NZ 3rd Test) కడపటి వార్తలు అందేసరికి న్యూజిలాండ్ రెండో ఇన్సింగ్స్ లో 5 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది.
ఇప్పటికే ఇంగ్లాండ్ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆ జట్టుకు చెందిన స్టార్ హిట్టర్ జోస్ బట్లర్ దంచి కొడుతుండడంతో మొదటి, రెండో టెస్టులో ఘన విజయాన్ని నమోదు చేసింది.
బట్లర్ తో పాటు పోప్ , కొత్తగా కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన బెన్ స్టోక్స్ సత్తా చాటడంతో పర్యాటక జట్టు కీవీస్ పై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వస్తోంది.
మ్యాచ్ పరంగా చూస్తే తాజాగా మూడో టెస్టులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి 51.5 ఓవర్లు ఆడింది. కీవీస్ స్టార్ ప్లేయర్లు టామ్ లాథమ్ 76 పరుగులు చేశాడు.
ఇందులో 12 ఫోర్లు ఉన్నాయి. ఇక న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 48 పరుగులు చేస్తే ఇందులో 8 ఫోర్లు ఉన్నాయి. ఆట ముగిసే సమయానికి డరైల్ మిచెల్ 4 పరుగులతో, బ్లన్ డెల్ 5 రన్స్ తో క్రీజులో ఆడుతున్నారు.
ఇప్పటి వరకు 137 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకు ముందు 6 వికెట్లు కోల్పోయి 264 రన్స్ తో ప్రారంభించిన ఇంగ్లండ్ మొత్తం 67 ఓవర్లు
ఆడి 360 రన్స్ చేసింది.
ఇక ఈ జట్టులో తొలి టెస్టు మ్యాచ్ ఆడుతున్న జేమ్స్ ఓవర్టన్ ధాటిగా ఆడాడు. కేవలం 3 పరుగుల తేడాతో సెంచరీ చేసే చాన్స్ కోల్పోయాడు. 97 రన్స్ చేశాడు.
ఇందులో 13 ఫోర్లు 2 సిక్స్ లు ఉన్నాయి. ఇక ఐపీఎల్ లో సత్తా చాటిన బెయిర్ స్టో 24 ఫోర్లతో దంచి కొట్టాడు కీవీస్ బౌలర్లను . 162 పరుగులు చేశాడు. స్టువర్ట్ బ్రాడ్ 36 బంతుల్లో 42 రన్స్ చేశాడు.
Also Read : ఐర్లాండ్ తో టీమిండియా టి20