Ashok Gehlot : కేంద్ర మంత్రి షెకావత్ పై సీఎం ఫైర్
ప్రభుత్వ కూల్చివేతకు కుట్ర కేసు
Ashok Gehlot : కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పై నిప్పులు చెరిగారు సీఎం అశోక్ గెహ్లాట్(Ashok Gehlot). 2020లో తన ప్రభుత్వాన్ని కూల్చి వేసేందుకు షెకావత్ కుట్ర పన్నారంటూ మరోసారి ఆరోపించారు.
తాజాగా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వాయిస్ శాంపిల్స్ కోసం యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ ) రివిజన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు జైపూర్ కోర్టు కేంద్ర మంత్రికి శాంపిల్స్ ఇవ్వాల్సిందిగా నోటీసులు జారీ చేసింది.
దీనిపై సీఎం అశోక్ గెహ్లాట్ స్పందించారు. జూలై 14వ తేదీ లోగా సమాధానం ఇవ్వాలని కోరారు. గత ఏడాది దిగువ కోర్టు అక్రమాస్తుల నిరోధక సంస్థ అభ్యర్థనను తిరస్కరించింది.
తదనంతరం అవినీతి నిరోధక శాఖ రివిజన్ పిటిషన్ దాఖలు చేసింది. దానిపై కోర్టు తాజాగా గజేంద్ర సింగ్ షెకావత్ ను సమాధానం ఇవ్వాలని కోరింది.
సింగ్ కు నోటీస్ జారీ చేసిన వెంటనే ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్(Ashok Gehlot) నిప్పులు చెరిగారు. మాటల తూటాలు పేల్చారు. గజేంద్ర సింగ్ షెకావత్ కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ తో కలిసి రెండేళ్ల కిందట తన ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రయత్నం చేశాడని సంచలన ఆరోపణలు చేశారు.
రాజస్తాన్ లో ప్రభుత్వాన్ని మార్చే అవకాశాన్ని సచిన్ పైలట్ వదులుకోక పోతే తూర్పు రాజస్తాన్ కెనాల్ ప్రాజెక్టు ద్వారా నీరు వచ్చి ఉండేదన్నారు.
జైపూర్ లోని చోము పట్టణంలో జరిగిన సమావేశంలో సీఎం అశోక్ గెహ్లాట్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read : సామాజిక మాధ్యమాలపై కేంద్రం ఫోకస్